Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సీతాకళ్యాణం

సీతాకళ్యాణాన్ని చూపుతుంది శ్రీవల్లీ రాధిక సీసపద్యం “సీతాకళ్యాణం”.

వారిజాక్షుని తోడ వయ్యారి సీతకు

కళ్యాణ మది నాకు కనుల విందు

బుగ్గన చుక్కతో పురుషోత్తమునిగని

సిగ్గుగ నవ్వెడి సిరిని జూసి

వాల్జడ బరువుల వైదేహి దెసగాంచి

అల్లరి దాచెడి హరిని జూసి

పరవశించు మదిని పట్టతరము గాదు

మహదానుభవమది మాట గాదు

కలిమి యొసగు సుఖములన్ని కాకు జేసి

కోటి జన్మల పుణ్యము కుదువబెట్టి

మనసులోననుప్పొంగగ మధుర గంగ

తనివి తీర జూడ దలతు తాపమణగ

Exit mobile version