[సౌనిధి గారు రచించిన ‘సీతాకోకచిలుక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
పూల చిగురులపై వాలావు
తేనెల మకరందాన్ని ముద్దాడావు
రంగుల కలల హారన్ని మోసావు
పూల తోటలలో నాట్యమాడావు
అంతులేని స్వేచ్ఛతో ఎగిరావు
ఆనంద గీతాలు ఆలపించావు
కనుల విందు చేసావు
జనుల గుండెలు దోచావు
జగతిని సుందరంగా మలిచావు
ప్రకృతి కానుకగా నిలిచావు