~
తెలుగు ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాక, డాక్యుమెంట్‌లో టైప్ చేసేటప్పుడు ఏ కీ నొక్కితే, ఏ తెలుగు అక్షరం పడుతుందో వివరంగా తెలుసుకుందాము.
డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. లాంగ్వేజ్ బార్‌లో ‘తె’ అనే అక్షరం కనబడుతుందో లేదో నిర్ధారించుకొని టైప్ చేయటం ప్రారంభించండి.
అచ్చులు:
a – అ
aa / A – ఆ
i – ఇ
ee / I – ఈ
u – ఉ
oo / U – ఊ
R – ఋ
e – ఎ
E – ఏ
ai – ఐ
o – ఒ
O – ఓ
ou – ఔ
am – అం
హల్లులు:
k – క
K, kh – ఖ
g – గ
G, gh – ఘ
ch – చ
Ch – ఛ
j – జ
J, jh – ఝ
T – ట
Th – ఠ
D – డ
Dh – ఢ
N – ణ
t – త
th – థ
d – ద
dh – ధ
n – న
p – ప
ph, f – ఫ
b – బ
bh, B – భ
m – మ
y – య
r – ర
l – ల
v – వ
S – శ
sh – ష
s – స
h – హ
L – ళ
ksha – క్ష
వీటికి గుణింతాలు టైప్ చేయటానికి ఒక ఉదాహరణ:
హల్లు అక్షరమైన k కు అచ్చులు చేరిస్తే అది ‘క’ గుణింతమౌతుంది.
ka, kaa, ki, kee / kI, ku, koo /kU, kR, ke, kE, kai, ko, kO, kou.
ఇది క గుణింతం. అలాగే మిగిలిన గుణింతాలు కూడా.
మరో సరికొత్త పాఠంతో వచ్చే వారం కలుసుకుందాము.
*
సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 350కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. ‘అమూల్యం’, ‘నువ్వు కడలివైతే…’, ‘పూల మనసులు’ అనే కథా సంపుటాలు ప్రచురించారు. ‘స్వాతిముత్యం’, ‘తరలి రావే ప్రభాతమా’, ‘అతులిత బంధం’ అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.