Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరస్సుల పేర్లు – బాలబాలికలకు క్విజ్

[‘సరస్సుల పేర్లు – బాలబాలికలకు క్విజ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

  1. టైగర్ మంచంపై పడుకునే సరస్సు పేరు ఏమిటి?
  2. నీలిరంగు పక్షి ఉన్న సరస్సు పేరు ఏమిటి?
  3. పరశురాముని తల్లి పేరున్న సరస్సు పేరు ఏమిటి?
  4. ‘పప్పు’ తినే సరస్సు పేరు ఏమిటి?
  5. కలకత్తా ఎయిర్ పోర్టు పాత పేరుతో గల సరస్సు ఏది?
  6. పక్షి శాస్త్రవేత్త పేరుతో ఉన్న సరస్సు పేరు ఏమిటి?
  7. పన్నెండేండ్ల వయసు కలిగిన సరస్సు పేరు ఏమిటి?
  8. ఎనిమిది ముళ్ళు వేసుకున్న సరస్సు పేరు ఏమిటి?
  9. ‘మధు సముద్రం’ పేరు గల సరస్సు ఏది?
  10. ‘క్లాత్ విలేజ్’ పేరు గల సరస్సు ఏదో చెప్పండి?
  11. సప్త రుషుల్లోని మహర్షి పేరుతో ఉన్న సరస్సు ఏది?
  12. సూర్యుడు పేరుతో ఉన్న సరస్సు ఏదో చెప్పండి?
  13. సాంబారు, ఉప్పు ఉన్న సరస్సు ఏది?
  14. భీముడి తల ఉన్న సరస్సు ఏది?
  15. వెన్న దొరికే సరస్సు పేరు చెప్పండి?

జవాబులు:

1.పులికాట్ సరస్సు 2. బ్లూ బర్డ్ సరస్సు 3. రేణుక  4. దాల్ లేక్ 5. డమ్ డమా లేక్ 6. సలీం అలీ లేక్ 7. పుష్కర్ సరస్సు 8. అష్టముడి సరస్సు 9. సుర్ సాగర్ లేక్, 10. వస్త్రపూర్ సరస్సు, 11. భ్రుగ్ లేక్, 12. సూరజ్ కుండ్ 13. సాంభార్ సాల్ట్ లేక్ 14. భీమ్ తల్ లేక్ 15. వెన్నాలేక్

Exit mobile version