[‘సరస్సుల పేర్లు – బాలబాలికలకు క్విజ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]


- టైగర్ మంచంపై పడుకునే సరస్సు పేరు ఏమిటి?
- నీలిరంగు పక్షి ఉన్న సరస్సు పేరు ఏమిటి?
- పరశురాముని తల్లి పేరున్న సరస్సు పేరు ఏమిటి?
- ‘పప్పు’ తినే సరస్సు పేరు ఏమిటి?
- కలకత్తా ఎయిర్ పోర్టు పాత పేరుతో గల సరస్సు ఏది?
- పక్షి శాస్త్రవేత్త పేరుతో ఉన్న సరస్సు పేరు ఏమిటి?
- పన్నెండేండ్ల వయసు కలిగిన సరస్సు పేరు ఏమిటి?
- ఎనిమిది ముళ్ళు వేసుకున్న సరస్సు పేరు ఏమిటి?
- ‘మధు సముద్రం’ పేరు గల సరస్సు ఏది?
- ‘క్లాత్ విలేజ్’ పేరు గల సరస్సు ఏదో చెప్పండి?
- సప్త రుషుల్లోని మహర్షి పేరుతో ఉన్న సరస్సు ఏది?
- సూర్యుడు పేరుతో ఉన్న సరస్సు ఏదో చెప్పండి?
- సాంబారు, ఉప్పు ఉన్న సరస్సు ఏది?
- భీముడి తల ఉన్న సరస్సు ఏది?
- వెన్న దొరికే సరస్సు పేరు చెప్పండి?
జవాబులు:
1.పులికాట్ సరస్సు 2. బ్లూ బర్డ్ సరస్సు 3. రేణుక 4. దాల్ లేక్ 5. డమ్ డమా లేక్ 6. సలీం అలీ లేక్ 7. పుష్కర్ సరస్సు 8. అష్టముడి సరస్సు 9. సుర్ సాగర్ లేక్, 10. వస్త్రపూర్ సరస్సు, 11. భ్రుగ్ లేక్, 12. సూరజ్ కుండ్ 13. సాంభార్ సాల్ట్ లేక్ 14. భీమ్ తల్ లేక్ 15. వెన్నాలేక్

డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.