[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 27
కర్నాటక సంగీతములో గ్రహ భేదం:
కర్నాటక సంగీతంలో ఒక రాగంలో ఉన్న స్వరస్థానాలను తీసుకుని, అందులో ఆధార షడ్జమం స్థానాన్ని వేరే స్వరస్థానానికి మారిస్తే వేరే రాగం వస్తుంది. ఈ ప్రకియనే గ్రహ భేదం అంటారు. గ్రహం అనే పదం స్థానాన్ని భేదం అనే పదం మార్పుని సూచిస్తాయి. ఆధార షడ్జమాన్ని మార్చడం మూలంగా ఈ ప్రక్రియని శ్రుతి భేదం లేదా స్వర భేదం అని కూడా అంటారు.
మేళకర్తలు గ్రహ భేదం వేస్తే – మేళకర్త రాగాలు వస్తాయి.
72 మేళకర్తలలో గ్రహ భేదం చేస్తే full scale ఉన్న రాగాలు వస్తాయి. ఉదాహరణకి శంకరాభరణం రాగం (29 మేళ) గ్రహ భేదం చేస్తే – కల్యాణి (65 మేళ), హనుమతోడి(8 మేళ), నఠభైరవి (20 మేళ), ఖరహరప్రియ (22 మేళ), హరికాంభోజి (28 మేళ) వస్తాయి.
మూర్ఛనాకారక జన్యరాగములు – వాటిలో గ్రహస్వరములు చేసిన ఏర్పడు ఇతర జన్య రాగములు – పట్టిక
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.