సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Shyam Kumar chagal

    ఒక కళాకారుడు అభివృద్ధి చెందాలంటే లేదా మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మొదటి అడుగు చిన్నతనంలోనే ముందుకు సాగాలి అన్నది చాలా బాగా వివరించారు రచయిత మురళీకృష్ణ గారు. ఒక జీవితకాలం కృషి చేస్తే గాని ఆ శిఖరాలను అందుకోవడం అందరి తరం కాదు. కళాకారుడు అభివృద్ధి చెందడానికి తపన తపస్సు మాత్రమేకాక వారి రోజు వారీ జీవితంలో ఆ కళ ప్రతి రోజూ ప్రతి నిమిషం నాట్యం చేస్తూనే ఉండాలి. బాగా గమనిస్తే శ్రీమతి లతా మంగేష్కర్ గారి జీవిత ప్రస్థానంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ,సాధించిన విజయాలు ప్రతి కళాకారుడికి కూడా ఉత్కృష్టమైన తన గమ్యం చేరుకోవడానికి మైలురాళ్ళులా గా పనిచేస్తాయి. ఆవిడ జీవితపు అంకాలు గమనిస్తే ఒక కళారాధన లో వ్యక్తి ఎంతటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమవుతుంది. ఏది ఏమైనా పట్టుదలకి తార్కాణం అయిన శ్రీమతి లతా మంగేష్కర్ జీవితపు మలుపులను మనకు పరిచయం చేస్తున్న రచయిత శ్రీ మురళీ కృష్ణ గారికి నా కృతజ్ఞతలు.

  2. 2

    HVSN Prasad Rao

    లత గారి బయోగ్రఫీ చాలా ఆసక్తి కరంగా సాగుతోంది సర్! మంగేష్కర్ అన్న ఇంటి పేరు ఎలా వచ్చిందన్న అంశాన్ని ముచ్చట గొలిపే విధంగా వ్రాశారు!

    సుమారు పాతికేళ్ల కిందటి మా గోవా పర్యటనలో ! దీనానాధ్ తండ్రి పూజారిగా పని చేసిన! మంగేష్కర్ ఆలయ సందర్శన! లత గారి కుటుంబానికి ఆ ఆలయానికి గల అనుబంధం! గురించి మా గైడ్ ఇచ్చిన వివరణ! ఆ ఆలయం పక్కనే వారి పూర్వీకుల ఇల్లు! ఇవన్నీ ఒక్కసారి మదిలో మెదిలాయి!

    మీ పరిశోధన బాగా లోతుగానే కొనసాగుతున్నది!

    తండ్రి ప్రభావం చిన్నారి లత మీద ఎలా పడిందన్న వివరణ సందర్భంగా మీరు చెప్పిన కొటేషన్ : ఎలాగైతే భాషలో ప్రతి పదానికీ అర్థం వుంటుందో! అలాగే సంగీతంలో ప్రతి స్వరానికీ ఒక అర్ధం వుంటుంది!

    ఎంత గొప్ప మాట!!!
    ఏదో యాంత్రికంగా కాకుండా! హృదయంలో అనుభూతి చెందుతూ పాడే గాయనీ గాయకులకు మాత్రమే అర్ధం అయ్యే మాట!

    సంగీత జ్ఞానం లేని నాబోటి సామాన్య శ్రోతలకు కూడా మనసుకు హత్తుకునే మాట!

    మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో లతా గారి బాల్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు!

    13 ఏళ్ళ చిరుప్రాయం లోనే సంసార భారాన్ని మోయడం కోసం కష్టాల కడలిని ఈదడానికి సిధ్ధపడుతున్న చిన్నారి లత ! దగ్గర ఈ ఎపిసోడ్ ను ఆపేసి పాఠకులను కూడా నడిసముద్రంలో వదిలేశారు!

    బాలీవుడ్లో విశేషాలతో పాటు ఆనాటి సామాజిక స్ధితి గతులను కూడా పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా వున్న మీ వివరణ చాలా బాగుంది!

    👏👏👏👌👌👌👍👍👍🌹

  3. 3

    Dr.Trinadha Rudraraju

    లతా మంగేష్కర్ గారి పై తండ్రి శ్రీ దీనానాథ్ గారి ప్రభావం అర్థవంతంగా విశదీకరించారు. శ్రీ మురళీకృష్ణ గారికి అభినందనలు

  4. 4

    Alluri Gouri Lakshmi

    చిట్టి విత్తనం మహా వృక్షంగా ఎలా ఎదిగింది అన్న క్రమం ఎంతో ఆసక్తికరంగా చెబుతున్న మీకు మా ధన్యవాదాలు కస్తూరి గారూ ..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!