Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సానీలు

“ఇదివరకు తూర్పు వైపు చూసేవాణ్ణి, ఇప్పుడైతెే నీ వదనంలోనే” అంటున్నారు శ్రీరామదాసు అమరనాథ్ ఈ “సానీలు”లో.

1.రాగం
ఎక్కడనుంచి వస్తుందో  తీయటి గాలి
నీలోని ప్రేమానురాగం కదూ.

2.తానం
నా పాటను నడిపించేది
నీ అడుగుల గలగల సవ్వడి.

3.పల్లవి
నా గొంతులో అలవోకగా పలుకుతుంది
ఎక్కడినుంచో నీ పిలుపు.

4.ఉదయం
గతంలో తూర్పు వైపు చూసేవాణ్ణి
ఇప్పుడైతే నీ ముఖంలోనే.

5.సాయంత్రం
సముద్రంలో మునిగే సూర్యుణ్ణి చూస్తూ నేను
నీటిలో చక్రవాలంలా నీవు.

Exit mobile version