Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సానీలు-1

  1. తాజమహల్
    ఏ కవికి  అందనివి  దాని  హొయలు
    శిల్పుల  కన్నీళ్ల  చలువరాళ్లు.

  2. నయాగరా
    విశ్వసుందరి నవ్వుల గలగల
    భళా! సౌందర్యలహరి.

  3. దీపం
    ఎంతైనా చెప్పలేం దాని ధైర్యం
    ఎంత చీకటినైనా తరిమి కొడుతుంది.

  4. నగరం
    ప్రతిరోజూ అక్కడ  పరుగు పందెం
    ఓడి పోయేవాళ్లు ఎంతమందో !

  5. వేమన
    తన పేరులో కులాన్ని ఖండించాడు
    కుళ్ళిన సమాజాన్ని దండించాడు.

Exit mobile version