[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
వందనం
అభివందనం
ఉదయాకాశం స్వాగతిస్తుంది పులుముకు ప్రభాతపు చందనం
చింత ఉమ
నకిరేకల్
2
దండాలు
గండాలు
ప్రతి మెచ్చుకోలు తదుపరి అడుగుకి అరదండాలు.
వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.
3
దోపిడి
రాపిడి
ఆపేస్తే ప్రజాజీవనం నల్లేరుపై నడకకు మార్పిడి!
పట్నం శేషాద్రి
హైదరాబాద్
4
రక్షకులు
భక్షకులు
పాలకులు కాకూడదు ప్రజల పాలిటి తక్షకులు
కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్
5
నాటకం
బూటకం
రక్తసంబంధాలను మరిచి ఆస్తులకై మనుజుల పితలాటకం.
వి. సుబ్బారావు,
పెందుర్తి. వైజాగ్
6
కధలు
వ్యధలు
జీవితగమనంలో కష్టనష్టాలు దాటితేనే లభ్యమగును సుధలు
విజయకుమారి ముదిగొండ
విజయవాడ
7
కుంగిపోకు
లొంగిపోకు
అనుకున్నది జరగలేదని నిరాశా వాదిగా మిగిలిపోకు
కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
బెంగళూర్
8
జబ్బు
గబ్బు
ఏదైనా ఇట్టే మాయo ఉంటే డబ్బు
Ln. డా. వేదుల శ్రీరామశర్మ ‘శిరీష’,
కాకినాడ.
9
వాకిళ్ళు
లోగిళ్ళు
స్వప్నాలకు నెలవు -కలలు కనే కళ్ళు
YLNV ప్రసాద్ రావు, విజయనగరం.
10
కవ్వించాలి
నవ్వించాలి
విద్యార్థులకు మధ్యాహ్న భోజనము మేమే తినిపించాలి
డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
కరీంనగర్
11
సాగునీరు
తాగునీరు
ఆరుగాలం కష్టించే రైతన్నలకు ఏదీ అందనీరు
కాకర్ల చెంచలరావు
ఒంగోలు.
12
కనికరించు
అనుకరించు
మంచిపని చేయటానికి ఎవరికైనా మనఃపూర్తిగా సహకరించు
రాజేశ్వరి కుప్పిలి
విజయనగరం
13
గెలుపు
మలుపు
అపజయాల అంచుల్లో విజయం విలువ తెలుపు..!
జవ్వాదిసూర్యారావు,
పర్లాకిమిడి, గజపతి జిల్లా, ఒడిశా,
14
సంసారం
కాసారం
నిబద్ధతతో నడుచుకో పెద్దల ఆదేశాల అనుసారం
సింగీతం విజయలక్ష్మి
చెన్నై
15
సలసలా
గిలగిలా
కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది ప్రకృతి విలవిలా!
డా. పద్మావతి పి
హైదరాబాద్
16
మాటలు!
కోటలు!!
మితిమీరి ఉండకూడదు జీవితంలో అతి తెలివితేటలు!!!
మన్నవ సుధాకర్
కృష్ణలంక, విజయవాడ
17
అరుస్తుంది
చరిస్తుంది
తామరకొలనులో సామ్యవాదపు మకరం తత్త్వవేత్తలను కరుస్తుంది
ఫణీంద్ర విన్నకోట,
హైదరాబాదు
18
అన్నము!
కన్నము!!
కలలో కూడా జీవితం కాకూడదు ఛిన్నాభిన్నము!!!
మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ
19
ముళ్ళు
తాళ్ళు
కవుల భావనలు సామాజిక స్పృహకి రెండుకళ్ళు.
యాచవరపు పద్మ
హైదరాబాదు.
20
ప్రసవాలు
సవాలు
అమ్మల సహనాలకు ప్రేమలకు తెగింపులకు ఆనవాలు
డా. గాదిరాజు మధుసూదనరాజు.
అనంతపురము.
21
మోదము
నిర్వేదము
జీవితమంటే సుఖదుఃఖాల సమ్మేళనమని చెప్పింది వేదము..
ములగ రాధాకృష్ణ
బొబ్బిలి
22
ఆధిక్యత
సమైక్యత
సామరస్యంగా జీవించటానికి కావాల్సిన తాళంచెవి ఐక్యత.
కే. ఎం. కే. మూర్తి
సికింద్రాబాద్
23
కలుపు
మలుపు
మన శక్తి పూర్తి వినియోగమే గెలుపు.
కత్రోజు నర్సింహాచారి,
సికింద్రాబాద్.
24
తిలకించాలి
పలికించాలి
పరిశీలించి పద్ధతిగా మాట్లాడితే మది పులకించాలి..!!
శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద్
25
తనువు
ధనువు
ఒంగితేనే లక్ష్యo సాధనకు అవుతుంది అనువు!
బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి
~
(మళ్ళీ కలుద్దాం)