[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1 రణము! మరణము!! జీవితంలో ప్రతీ ఒక సంఘటన చర్వితచర్వణము!!!
మన్నవ సుధాకర్ కృష్ణలంక, విజయవాడ
2 కాయటం మోయటం స్వభావం చెట్టుకి. మనిషికి స్వలాభం – కోయటం
డా. గాదిరాజు మధుసూదనరాజు, అనంతపురము.
3 వేషం! రోషం!! స్వచ్ఛమైన మనసుతో సంతృప్తితో, జీవనమే సంతోషం!!!
నేమాన సుభాష్ చంద్ర బోస్, విశాఖపట్నం
4 శిక్షణ రక్షణ దీర్ఘకాలిక ఫలితాలకు స్వల్పకాలిక అలసట- క్రమశిక్షణ.
విత్తనాల విజయ కుమార్ హైదరాబాద్
5 బంధాలు అనుబంధాలు కనుమరుగయ్యే వాటిని సరిచేసుకోవాలి – అంతరిస్తుంటే సంబంధాలు.
కే. ఎం. కే. మూర్తి సికింద్రాబాద్
6 కలవరింత నిలువరింత చిన్ననాటి గురువు పలకరిస్తే తనువంతా పులకరింత
ఆర్ ఎస్ రాజకుమార్ విశాఖపట్నం
7 గళము నిగళము జీవుడే దేవుడిగా, తత్త్వమసిగా పరిణమించిన యుగళము!
వీరేశ్వర రావు మూల అమలాపురం
8 అధికారం అహంకారం పదవిని దుర్వినియోగపరిస్తే కోల్పోతారు ప్రజల సహకారం!
నరహరి రావు బాపురం అనంతపురము
9 భక్తి ముక్తి అనుకోని సంఘటనలతో భక్తుల జీవితాలకు విముక్తి
సూర్యదేవర రవికుమార్ గుంటూరు
10 కసురు విసురు రైతుల ఉసురు తీసే అకాల ముసురు!
గోపరాజు వెంకట సూర్యనారాయణ హైదరాబాద్.
11 ద్వేషo రోషం వీటికి దూరంగా ఉంటే అంటదు దోషం.
చింతపల్లి వేణుగోపాలకృష్ణ, కాకినాడ.
12 సహజనీతి సమాజనీతి గతి తప్పితే రాజనీతి -ప్రబలునుగా అవినీతి!
కాటేగారు పాండురంగ విఠల్ హైదరాబాద్
13 తుల్యం అతుల్యం తాడులేని బొంగరం, నీడలేని నీరజాక్షి సమతుల్యం
K సత్యనారాయణ, విశాఖపట్నం
14 హాసం మందహాసం పొరపాటున కూడా చేయకుమా ఇతరులను పరిహాసం!
సుజాతారావు వైజాగ్
15 కరువు అరువు భూసారాన్ని నిర్వీర్యం చేస్తున్న రసాయనిక ఎరువు
కట్టెకోల చిన నరసయ్య, ఖమ్మం
16 హితము లోహితము లోకానికి శుభాన్నిచ్చే కార్యక్రమాలు కావాలి హింసారహితము
డా. పి. వి. రామ కుమార్ హైదరాబాద్
17 మురిసింది విరిసింది కవి కలం కదిపితే అమృతం కురిసింది.
క్రొవ్విడి వెంకట బలరామమూర్తి హైదరాబాద్.
18 వ్యష్టి వృష్టి నిజమైన లక్ష్యసాధనకు ఎప్పుడూ తోడుంటుంది సృష్టి
మాధవి మేళ్ళచెర్వు గుంటూరు
19 ఆశ్చర్యకరం ఉపయోగకరం తేనెటీగ కుట్టేదైనా ఇచ్చే తేనె ఆరోగ్యకరం.
కత్రోజు నర్సింహాచారి, సికింద్రాబాద్.
20 మంచితనం మనసుతనం కష్టాలను ఎదుర్కోవడానికి కావాలి అసలైన తెగువతనం
వురిమళ్ల సునంద, ఖమ్మం
21 రాల్చటం దాల్చటం మేలు చేయడమంటే ఇతరుల అవసరాలు తీర్చటం
ఆలేటి పరంజ్యోతి ఖమ్మం
22 తప్పెట గుప్పెట ఇంటిగుట్టు రచ్చకెక్కితే తప్పదు దాడి ముప్పేట
ఇలపావులూరి రాజ్యలక్ష్మి హైదరాబాద్
23 చనువు తనువు పరమతమైనా పెద్దల అనుమతితో పొందాలి మనువు.
బెహరా నాగభూషణరావు, గజపతినగరం.
24 ముడులు చిక్కుముడులు పరిణయబంధ పటిష్టతకు పూనుకొన్న పునాదులే మూడుముడులు!
పట్నాయకుని రామకృష్ణారావు కంచరపాలెం. విశాఖపట్నం.
25 జరుగు తరుగు కష్టపడి సంపాదించిన పేరుప్రఖ్యాతులన్నీ కాలంలో కనుమరుగు..!!
శ్రీమతి భారతీకృష్ణ హైదరాబాద్ ~
(మళ్ళీ కలుద్దాం)
You must be logged in to post a comment.
గొంతు విప్పిన గువ్వ – 5
పదసంచిక-16
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-48
ఈ తరం అమ్మాయి
చిరుజల్లు 12
సంచిక – పద ప్రతిభ – 82
భూతాల బంగ్లా-2
పదచదరాలు – పుస్తక పరిచయం
మరుగునపడ్డ మాణిక్యాలు – 57: అరణ్యేర్ దిన్ రాత్రి
వివిధ రంగాలలో తొలి భారతీయ మహిళ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®