Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచికలో 25 సప్తపదులు-13

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

 

~

1
గణనాయకుడు
ఘననాయకుడు
విద్యలకెల్ల ఆదిగురువై విలసిల్లే వినాయకుడు సద్గుణదాయకుడు

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

2
తరం
అంతరం
దేశాభివృద్ధికి చోదకశక్తులుగా నడుం బిగించాలి యువతరం.

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

3
చలించు
జ్వలించు
పట్టుదలకు కృషిని జోడిస్తే అనుకున్నది ఫలించు .

వురిమళ్ల సునంద,
ఖమ్మం

4
సంగరం
సాగరం
సుడిలో తిరుగుతున్న పడవలా బతుకనే బొంగరం.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైదరాబాద్

5
నాడు!
నేడు!!
లోపాలు తెలుసుకొని ఇప్పటికైనా వాటిని విడనాడు!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ

6
చేతిగీత
తలరాత
కర్మసిద్ధాంతానికి మించినవి కావని చెప్పేదే భగవద్గీత

బి .బి.రవి కుమార్
విజయవాడ

7
పైశాచికత్వం
కర్కోటకత్వం
కాదు -కావలసింది ఆడపడుచుని కాపాడటంలో మానవత్వం

డా ఉషారాణి కోగంటి
హైదరాబాద్

8
ఇభం
శుభం
సేవ చేస్తూనే, ఛీత్కారానికి గురి రాసభం!

ఎన్ ఆర్ తపస్వి
చెన్నై

9
పలకరింపు
వెక్కిరింపు
పరామర్శ మంచిదే! పరాభవమే ఎదుటివారికి తలవంపు!!

K సత్యనారాయణ
విశాఖపట్నం

10
జ్ఞానం
అజ్ఞానం
తనను తాను పరిశోధించుకుంటే అదే పరిజ్ఞానం

షామీర్ జానకీదేవి
హైదరాబాద్

11
స్నానం
ధ్యానం
దేహము బుద్ధి, శుద్ధికి సాగించే యానం!!

యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.

12
చిత్రం
విచిత్రం
కాలంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకమే ‘ఛాయాచిత్రం’

బిక్కునూరి రాజేశ్వర్
నిర్మల్

13
ప్రళయం
విలయం
ఎంత విధ్వంసకరమో ప్రకృతి విసిరే వలయం!

పట్నాయకుని రామకృష్ణారావు
కంచరపాలెం.విశాఖపట్నం.

14
అస్త్రము
శస్త్రము
అల్పుల మీద ప్రయోగించకూడదని చెబుతుంది శాస్త్రము

హైమ. కందుకూరి
హైదరాబాద్

15
తొలి
మలి
ఎప్పుడైనా రావొచ్చును అవతార పురుషుడు కలి!!

మిథున్,
మార్టేరు.

16
పూరణం
ధారణం
అవధానప్రక్రియలో అమోఘమైన ప్రజ్ఞాపాటవాలే ప్రాచుర్యానికి కారణం

కాళీపట్నపు శారద
హైదరాబాదు

17
ఇష్టం
కష్టం
బంధలో నమ్మకం లేకపోతే కలుగుతుంది నష్టం

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

18
ప్రదర్శనం
నిదర్శనం
ఆటుపోట్లు మొదలయ్యాకే అసలు మనిషి దర్శనం .

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

19
ధైర్యవంతులు
భాగ్యవంతులు
ఆరోగ్యoగా ఉన్నవారే అసలు సిసలైన అదృష్టవంతులు.

రాయవరపు సరస్వతి
చోడవరం,అనకాపల్లిజిల్లా

20
చెంతన
వంతెన
ఉభయబిందువుల మధ్య
పరస్పరం కల్పించు పొంతన.

డబ్బీరు ప్రభాకర్
రాయపూర్.

21
కాదు
లేదు
మనది కానిది ఏదీ మనతో నిలిచిపోదు..

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

22
ఉదయం!
సదయం!
భగవంతుని మనికిపట్టు
దయగల మనిషి హృదయం!

సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు

23
సఫలం
విఫలం
మూర్ఖులను ఒప్పించటానికి చేసే ప్రయత్నాలు నిష్ఫలం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

24
ఊడ
నీడ
తెలుసుకో విత్తనం నాటిన వాడి జాడ

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

25
సాన్నిహిత్యం,
ఐకమత్యం,
మానవీయమైన విలువలను మనుష్యులలో నిలిపేది సాహిత్యం!

దినవహి సత్యవతి
గుంటూరు.

~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version