
2025 ఉగాది సందర్భంగా, సంచిక – డాక్టర్ అమృతలత – సంయుక్తంగా నిర్వహించిన పద్యకావ్య పోటీ విజయవంతమైన నేపథ్యంలో మరోసారి పద్యకావ్య రచన పోటీని నిర్వహిస్తున్నాము.
సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా, భారతీయ సంస్కృతి ఇతివృత్తంగా రచింపబడిన పద్యకావ్యాలను పోటీకి ఆహ్వానిస్తున్నాము. విజేత(ల)కు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు ₹ 15,000/- బహుమతిగా అందిస్తారు.
పద్య కావ్య పోటీ నిబంధనలు:
- కావ్యం భారతీయ సంస్కృతి ఇతివృత్తంగా సలక్షణమైన భాషలో 350 పద్యాలకు మించకుండా రచించినదై ఉండాలి.
- ముద్రిత రచనలను, అనువాదాలను, శతకాలను, స్తోత్రాదులను, ఖండకావ్య సంపుటులను పంపించవద్దు.
- రచనలో దోషాలు లేకుండా ఒకటికి రెండుమార్లు సరిచూసుకొని, టైపు చేసిన ప్రతి యొక్క ప్రింటవుట్‌ను కాని; స్పష్టమైన వ్రాతప్రతిని కాని పంపించాలి. వ్రాతప్రతిని పంపిస్తున్నట్లయితే దాని ప్రత్యంతరాన్ని తమ వద్ద ఉంచుకోవాలి. ఒకవేళ పిడియఫ్ ప్రతిని వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపించినా, దాని ప్రింటవుట్‌ను పోస్టు ద్వారా తప్పక పంపించాలి.
- ఒకరు ఒక్క రచనను మాత్రమే పంపించాలి. ఒకసారి ప్రతిని పంపించిన తర్వాత మార్పులు, చేర్పులు, సవరణలు అంగీకరింపబడవు.
- రచన తొలిపుటలో అది మీ స్వీయకృతి అన్న హామీ పత్రాన్ని జతచేసి అందులో మీ చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి స్పష్టంగా పేర్కొనాలి.
- రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/రచయిత్రి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
- ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కావ్యాలు పంపవచ్చు.
- బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
- కావ్యం ప్రతులపై కవి/కవయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్‌నంబరు, ఈ-మెయిల్ ఐడీ రాయాలి.
- కావ్యాలు పంపవలసిన చివరి తేదీ 28/2/2026.
పంపాల్సిన విధానం:
మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikapadyakaavyapotee2025@gmail.com
మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక-స్వాధ్యాయ పద్య కావ్య రచన పోటీకి అని వ్రాయాలి.
వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక-స్వాధ్యాయ పద్య కావ్య రచన పోటీకి అని వ్రాయాలి.
By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sanchika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda,
Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక-స్వాధ్యాయ పద్య కావ్య రచన పోటీకి అని వ్రాయాలి.
17/3/2026 నాడు హైదరాబాదులో జరిగే కార్యక్రమంలో పద్యకావ్య విజేత (ల) కు ₹ 15,000/- బహుమతి అందజేస్తాము.
