సంచిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.
శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.
ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.
వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.
~
ఈ పజిల్‍ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.
~
పదసోపానం 35 | |
1 | బక్కపలచ |
2 | |
3 | |
4 | |
5 | |
6 | |
7 | |
8 | |
9 | |
10 | |
11 | |
12 | స్థూలకాయము |
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక పదసోపానం-35 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జనవరి 12 తేదీన వెలువడతాయి.
సంచిక పదసోపానం 33 కి పజిల్ నిర్వాహకుల జవాబులు:
1.హేమమాలిని 2. లీనా జుమానీ 3. మానసి సాల్వి 4. సెలీనా జైట్లీ 5. జటాజూటము 6. టముకువేయు 7. వయోజనుడు 8. నడుముకట్టు 9. కాటుక కళ్లు 10. కళామతల్లి 11. తొలి విజయం 12. జయబాధురి
సంచిక పదసోపానం 33 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు మోహన్ రావు
- కాళిపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.