‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) మంగళగిరి లోని దైవం (6) |
7) అటుగా పారిపోయిన (4) |
10) ఒక రకం చర్మ వాయిద్యం (2) |
11) ఆముదం చెట్టు (3) |
13) పరాజయం, అలాగే చివరి రెండు తడబడ్డాయి (4) |
14) బయటపడిన (4) |
15) కనిపించకుండా తప్పించుకు పోయినవాడు (3) |
17) మొలక (2) |
18) ఎర్రని లోహం, ఒక రకం పైరు (2) |
19) ఏనుగు చెక్కిలి (3) |
20) శక్తి, సామర్ధ్యము (3) |
23) తల తెగిన పూరీలు (2) |
24) వైజయంతీ విలాసం రచయిత (6) |
26) బాడుగ (3) |
27) కుక్క (4) |
నిలువు:
2) వెనుదిరిగిన స్త్రీ (2) |
3) కొడవలి (4) |
4) పరిమితమైన (2) |
5) మెరుపు (2) |
6) హిమబిందు నవలా రచయిత (7) |
8) సూర్యుడు, చీకటి శత్రువు (4) |
9) వాయు పుత్రులు, మరోలా (7) |
12) ఇంటి వెనుక గల ప్రదేశం (3) |
13) పరధ్యానం (3) |
16) స్త్రీలు భుజంపై వేలాడేటట్లు వేసుకొనే చీర చివరి తో (5) |
17) బంగారు నాణెం (3) |
21) బైరాగి (3) |
22) ఇనుప పని చేసే వారి వృత్తి (3) |
25) పద్యంలో విశ్రాంతి స్థానం, ముని (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 సెప్టెంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక సెప్టెంబర్ 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబర్ 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – ఆగస్ట్ 2025 సమాధానాలు:
అడ్డం:
1) గురుకులం 3) గుప్తధనము 7) కడాని 8) పర 9) వాగుబిరు 11) రక్షితం 13) నినాదము 15) కరుణ 17) చిట్టా 18) ధార19) లంజాయామా 21) దారి 23) ప్రమి 24) ఎరుకసానులు 26) ప్రతినిధి 28) వామ 29) క్కాహు 30) రసరాజం 31) అధికారం 32) ధామములు
నిలువు:
1) గురువారం 2) కుటుంబిని 3) గుడారము 4) ప్తనిక్షి 5) నప 6) మురకాణగు 10) రునాచిమా 12) తంకర 14) దట్టా 16) ప్రజా ప్రతినిధి18) ధారిక 20) యామిని 21)దారుక 22) మనమరాలు 25) సావాసము 27) ధిక్కారం 30) రమ
సంచిక – పదప్రహేళిక – ఆగస్ట్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త.కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- ఉషారాణి. జి, తిరుపతి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387