‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) తాటక పుత్రుడు (4) |
| 3) వివాహ సమయంలో వధూవరులకు ఇచ్చే బహుమతి (5) |
| 6) అడవి (2) |
| 7) చిత్తరువులు రాసేవాడు, లేకరి (5) |
| 10) ఆజ్ఞ, చట్టం (3) |
| 12 మథించు, గొళ్ళెం (3) |
| 14) తగ్గింపు, రిబేటు (3) |
| 16) పాములకు ఆనందం కోసం ఊదే బుర్ర (4) |
| 18) క్రయవిక్రయాదుల వల్ల వచ్చే రాబడి (2) |
| 19) దురద, తొమ్మిది (2) |
| 20) అటుగా అప్పు (2) |
| 21) చుట్టరికం (2) |
| 24) దాసుడు, సేవకుడు చెదిరినాడు (3) |
| 26) చూపు, నేత్రం, (నా వత్తు లేదు) (2) |
| 27) కొంచెం, ఇసుమంత (2) |
| 28) నిధీశుడు అలాగే 3,1, 2, 4 (4) |
| 29) పనికిమాలిన (3) |
| 30) అటుగా రాధను పిలవండి (2) |
| 32) చాకలివాడు (4) |
| 33) నవ్వడంలోని ధ్వనికి అనుకరణలు (5) |
నిలువు:
| 1) ఇంద్రుని రథ సారథి (3) |
| 2) వాత (3) |
| 3) మెలి, మెలిక (2) |
| 4) పత్తి, నూలు బట్ట (4) |
| 5) ఏనుగు (2) |
| 6) చెదిరిన యముడు, శివుడు (3) |
| 8) వంశంలోని పూర్వుల సముదాయం (4) |
| 9) కుంకుమపువ్వు, లవంగం (3) |
| 11) కుమార్తె, 20వ సంవత్సరం (3) |
| 13) పక్షి గూడు (3) |
| 15) పెద్ద అరుపు, కేక (4) |
| 17) వజ్రాయుధము (3) |
| 21) భర్త మరియు సంతానం గల స్త్రీ (2) |
| 22) అటుగా పరులకు లోబడినవాడు (5) |
| 23) ధరను కలిగిన భూమి (4) |
| 25) శ్మశానం (4) |
| 26) చిన్నకథ అటుగా (4) |
| 29) లేహనం చేయు (2) |
| 31) తప్పగింజ, పొల్లు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 నవంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక నవంబర్ 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబర్ 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2025 సమాధానాలు:
అడ్డం:
1) తనఖా 4) భాసంతి 7) ధీమా 9) తటిని 11) పరిక 14) కరడి 16) కన్యక 18) గస 20) తిమ్మరి 22) సిపాయి 24) రరాటం 26) రిక్తత 28) లంసా 29) తంకర 31) మురారి 34) ముసాబు 36) జుత్తిలి 38) హితం 40) లంగరు 42) కయ్యము 44) నందన 46) తదియ 48) ముచ్చి 49) రసజ్ఞ 50) తంతియ
నిలువు:
2) నత 3) ఖాటిక 5) సంప 6) తిరిక 8 మారాం 10) నిరతి 12) కన్యసి 13) గాగర 15) డిమ్మరి 17) కపాలం 19) సరాతం 21) రిక్తము 23) యిసాక 25) టంకము 27) తరాజు 30) రసాలం 32) రిత్తిక 33) తుహినం 35) బుగత 37) లియ్యము 39) తందర 41) రుదితం 43) ముచ్చిలి 45) నస 47) యతి
సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త.కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి. జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

