Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక నవంబర్ 2024

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నుయ్యి (4)
4. పాదాల దుమ్ము (3)
7. త్రోవ, మార్గము (2)
8. మెరుపు తీగ, మేఘదీపము (3)
10. నమ్మకంతో కూడిన ధైర్యం (3)
12. చేపలను పట్టే సాధనం (2)
13. సమస్తం, అంతా (3)
15. అడ్డం 7 తో వెన్న కాచిన మడ్డి (1)
16. చిన్న ఓడ (2)
17. పాపాత్ముడు కాదు, చినర ‘డు’ లేని పడే స్వభావం కలవాడు (3)
19. గర్వం (2)
21. ఎకరంలో సగం (2)
22. హఠాత్తుగా (3)
24. చేదు బీర, ఆలమంద (2)
25. జాడ, గుర్తు (3)
27. అమంగళమైన మాట (3)
30. రమ్మని గౌరవంగా పిలవండి (3)
32. విధం, చక్కదనం (2)
33. అటుగా లక్క (3)
34. తప్పు, పాపం (3)
35. దొంగ (4)

నిలువు:

1. దేనిలోను ఆసక్తి లేని స్త్రీ (4)
2. గట్టు, తీరం (2)
3. మాగాణి భూమి (2)
4. అర వీసె (3)
5. వండిన (3)
6. ముక్కర (4)
9. ప్రారంభం (4)
11. శేషం, చెడిన (2)
14. వాయిదా (2)
16. కీడు చేసి తలపు (2)
17. ఎనిమిది గవ్వల ప్రమాణం (3)
18. అమ్మకానికి హక్కుగల భూమి (4)
19. దౌర్బల్యం, కష్టం (3)
20. పెద్ద గోల (3)
23. కర్పూరం (3)
26. చెడ్డపని (4)
28. తాజా ఆవు నెయ్యి (4)
29. ప్రాయంలో ఉన్న (3)
31. అర్జునుడే, క్రింద నుంచి వచ్చాడు (3)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 నవంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక నవంబర్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబర్ 2024 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- అక్టోబర్ 2024 సమాధానాలు:

అడ్డం:

1) తిరుకాపు 3) తపతి 6) కోటి 7) రుక్మిణి 11) నిజం 13) రణం 14) రమ16) కుట్ర 18) ప్రజాహితం19) ఆబ 20) వర్ణం 21) తిమిరారి 23) పాదం 25) శవం 26) తోము 27) యమకం 29) పాయ 31) శోకము 32) మదం 33) నాభి

నిలువు:

1) తిగ 2) కాసు 3) తటిని 4) తిరు 5) శ్రేణి 8) క్మిరు 9) ఋణం10) నీరజా 12) జంకు 13) రసవతి 15) మహిమ 17) శబరి 19) ఆరావం 22) మిశ 23) పాము 24) యమలం 26) తోయదం 28) యముడు 30) మమ 31) శోభి

సంచిక పదప్రహేళిక- అక్టోబర్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.

Exit mobile version