Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక జూన్ 2025

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) మొదటి నుంచి చివరిదాకా (4)
3) వేకువ, సూర్యోదయానికి ముందు (5)
7) నల్లని వన్నెగల పక్షి (2)
8) పెరుగు చిలికే సాధనము (3)
9) వెన్నెల పులుగు (3)
12) అందగత్తె (3)
14) కొట్లాట, కలహం (3)
16) ఉపరిభాగం, మీద (1)
17) అడ్డం 16 తో సస్యము (1)
18) అతిశయపు మాటలు, మద్య ‘పా’ వత్తు లోపం (3)
19) నల్లని చారలు గల దుప్పి (3)
23) సంపాదన, లెక్క (3)
24) పెద్ద తరంగం (3)
25) అటువంటి – 1, 4 (2)
28) తోడేలు (5)
29) ప్రాణములు (4)

 

నిలువు:

1) ఓడ నడిపేవాడు (4)
2) అటుగా స్వప్నమా (2)
4) నానబెట్టిన వాటిని రోటిలో మెదుపు (2)
5) మోసగాడు, మోసగత్తె (4)
6) పెళ్ళివారి సహభోజనం (3)
10) నది, ఏరు (3)
11) ఆందోళన, ఆస్ట్రేలియా జంతువు (3)
13) సైనికుడు, రక్షకుడు (3)
15) క్రూరకృత్వం, భయంకరం (3)
20) గందరగోళం, గజిబిజిలా (4)
21) ప్రాకారము (3)
22) చిన్నకుండలు (4)
26) పత్రము (2)
27) పేకాటలో ప్రధానమైన ముక్క (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 జూన్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూన్ 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2025 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక – మే 2025 సమాధానాలు:

అడ్డం:

1) కరారునామా 4) లులాయము 7) మజిలి 9) క్షరి 10) వనిత 11) కుత్తు 12) యిరాకి 13) విడులద 15) మురారి 16) మారాము 18) మఖ 19) విభారివ 21) వీణ 22) లవణం 23) నిమిషం 24) తాహతు 25) ఆనంద 27) అప 28) డిల్ల 29) ఉత్తమురాలు

నిలువు:

1) కరువలి 2) రుగ్మత 3) మామకుడు 4) లులి 5) యక్షరాజు 6) మురికి 8) జిత్తులమారి 13) విరివి 14) దరావత్తు 15) ముఖవచనం 17) గుణవంతురాలు 18) మల 20) భారమితి 24) తాపము 25) ఆన 26) దడి 27) అత్త

సంచిక పదప్రహేళిక – మే 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version