Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక జూలై 2025

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సింహం (4)
3) ఇలకోడి, చిమ్మట (5)
6) మోసం (2)
7) ఎక్కువ పదును పెట్టినది (3)
9) తాటి టెంక నుండి మొలచిన మొలక (2)
10) తోక (2)
11) పాడదగిన ధ్వనుల వరస (2)
12) ఉడికీ ఉడకని బియ్యం (4)
13) ప్రజలు (2)
14) సత్య క్రియలో తొలిసగం (2)
15) ఎడమ వైపు (3)
16) బానిస (3)
19) పెంపుడు తల్లి (2)
21) పాదలేపనంతో తీర్థయాత్రలు చేసినవాడు (4)
22) ఉన్మాదం, పిచ్చి (2)
25) అర్చకుడు (3)
27) తగవులు పెట్టే వ్యక్తి (5)
28) బ్రహ్మ (3)

నిలువు:

1) రోలు (3)
2) కాపాడబడినది (3)
3) వయస్సు (2)
4) అభివృద్ది (4)
5) పూర్తిగా స్వాధీనంలో ఉంచుకొనడం (6)
6) నేర్పరితనం (3)
8) దిట్టతనం లేనివాడు (4)
9) రెల్లుగడ్డి, వెదురు (3)
10) గడువు (3)
13) మురికి నీళ్ళు పోయేదారి (4)
14) సముద్రంలో ముత్యపు చిప్పలు ఏరడం (3)
17) శుభకరమైన ప్రాతః కాలము (4)
18) తులసిదళాలు, పూలు కట్టిన దండ (4)
20) ఇటుక, మన్నుతో కట్టే స్తంభం (2)
23) పండితుడు (2)
24) పార్వతి (2)
25) బతుకమ్మను వీటితో అలంకరిస్తారు (2)
26) నూకలు, పిండితో వండిన పదార్థం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 జూలై 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూలై 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్ట్ 2025 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక – జూన్ 2025 సమాధానాలు:

అడ్డం:

1) ఆమూలాగ్రం 3) అరుణోదయం 7) కాకి 8) కవ్వము 9) చకోరం 12) రూపసి 14) తగాదా 16) పై 17) రు 18) గపాలు 19) రురువు 23) గడన 24) లహరి 25) అటి 28) అడవికుక్క 29) అసువులు

నిలువు:

1) ఆరకాటి 2) లాక 4) రుబ్బు 5) దగాకోరు 6) బువ్వము 10) ఆపగ 11) కంగారు 13) సిపాయి 15) దారుణం 20) గడబిడ 21) ప్రహరి 22) అటికలు 26) ఆకు 27) ఆసు

సంచిక పదప్రహేళిక – జూన్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

Exit mobile version