‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. ——అల్లిక జిగి బిగి.. ఎవరిది ? (6) | 
| 4. మేఘసందేశం కర్త (4) | 
| 8. శత్రువు (2) | 
| 9. తెలుగులో హన్సిక నటించిన తొలిచిత్రం – చెల్లా చెదురయ్యింది (5) | 
| 11. ఆకు (2) | 
| 13. కరవీర పుష్పము (3) | 
| 15. శివుడు (3) | 
| 16. సరళములలో చివరిది లేదు! (4) | 
| 18. అతిశయము; పరాక్రమము. (3) | 
| 19. దినమందు పదునేను భాగములలో ఎనిమిదవ భాగము (4) | 
| 20. నీటి కుప్ప (3) | 
| 21. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా( తెలుగు)- 1980 సంవత్సరంలో రజత నంది అవార్డు కూడా పొందిన సినిమా (3) | 
| 24. పాదపము (2) | 
| 25. చింత చెట్టు కాపు కొచ్చిందోయ్ ———– చిన్నదేమో దాపు కొచ్చిందోయ్ అని ANR, జయలలితల పాట (5) | 
| 26. అందమైన స్త్రీ – తిరగబడింది (2) | 
| 29. కుడినించి ఎడమకి చిత్తరువు (4) | 
| 30. ముందు లేనివి కల్పించి చెప్పడం (6) | 
నిలువు:
| 1. శ్రీ ఆంజనేయ స్వామి వారు వెలసిన ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం చిత్తూరు జిల్లాలో ఉంది (4) | 
| 2. ఒక వేదం (2) | 
| 3. శూరుడు అటు ఇటు అయ్యాడు (4) | 
| 5. ఆట క్రింది నుండి పైకి (2) | 
| 6. హాయి హాయిగా ఆమని సాగే అనే పాట ఈ సినెమాలోనిదే (6) | 
| 7. తైలం (3) | 
| 10. ————— పండించే వాడిదే పంట అని ఒక ప్రసిద్ధ నినాదం (7) | 
| 12. ఆంధ్ర షెల్లీ బిరుదు ఈయనదే (5) | 
| 14. భీముడు చంపిన వారిలో ఒకడు – మగధ రాజు అటు ఇటు అయిపోయాడు (5) | 
| 17. చెరపకురా చెడేవు లో బందిఖానా లేదు. (6) | 
| 21. నెలలు (3) | 
| 22. యుద్ధ క్షేత్రం తడబడింది – మున్షీ ప్రేమచంద్ గారి నవల కూడా (4) | 
| 23. ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి – ముగ్గురికి కామన్ గా ఉన్న ఒక సినిమా పేరు (4) | 
| 27. వాకిటిలోపలి ప్రక్కగోడ (2) | 
| 28. వ్యాఖ్యానము (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 27 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 18 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 25 జవాబులు:
అడ్డం:
1.కాళింది 3. అగ్నికి 5. రవేసు 7. వరాళి 8. లాఘవం 9. యుక్తము 11. తడవ 12. ఆకాశరాజు 14. పుత్తడి 15. హుజూరు 17. మేనా 18. నవ్య 19. గోరా 20. రుసి 21. సరదా 23. ణువేవు 25. టక్కరివాడు 27. కోడలు 29. సవర 30. ఠవర 32. వాదర 33. రంజనం 34. దివ్వెల 35. సహ్యజ
నిలువు:
1.కాళయుక్తి 2. దివము 3. అళి 4. కిలా 5. రవంత 6. సుగ్రీవము 10. కోశము 12. ఆడినదాట 13. జుహురాణుడు 14. పునాస 16. రురువు 22. హరిణం 24. లోకోత్తరం 26. సరసిజ 28. లుఠనం 29.సరస 31. రది 32. వాల
సంచిక – పద ప్రతిభ 25కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
 - అరుణరేఖ ముదిగొండ
 - భాగవతుల కృష్ణారావు
 - సిహెచ్.వి.బృందావనరావు
 - చెళ్ళపిళ్ళ రామమూర్తి
 - ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
 - మధుసూదనరావు తల్లాప్రగడ
 - పడమట సుబ్బలక్ష్మి
 - పి.వి.ఆర్. మూర్తి
 - రంగావఝల శారద
 - రామలింగయ్య టి
 - శంభర వెంకట రామ జోగారావు
 - శిష్ట్లా అనిత
 - శ్రీనివాసరావు సొంసాళె
 - తాతిరాజు జగం
 
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

