‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) అయిదు రకాల భోజన పదార్థములు (9) |
| 5) కస్తూరి, వ్యాసుని తల్లి అయిన సత్యవతి, ఆమడ దూరం పరిమళం వ్యాపింపజేసేది (5) |
| 6) స్త్రీ, పార్వతి, రాణి, పిక్క (2) |
| 7) పాల చెట్టు (3) |
| 8) _ _ మంత్రము, మనసే బంధము (2) |
| 11) దండించుట (3) |
| 12) సరస్వతి (5) |
| 13) దున్నేవాడిదే.. అనే నినాదాన్ని బహువచనంతో చెప్పండి (8) |
నిలువు:
| 1) పణం లేనిదే శోభ లేదు (ఆటల్లో ఇది ఉంటే, రక్తి కడుతుందన్న భావన) (9) |
| 2) మోక్ష సాధానాలలో ఒకటి (4) |
| 3) మగధ దేశానికి చెందినది, రాజుల కొలువులో స్తోత్రపాఠం చెప్పేవారి జాతి (4) |
| 4) ఒక్కటి గాని ఒక్కరు గాని ఉండడం కంటే రెండు గాని ఇద్దరు గాని జతగా ఉంటే మంచిదనే వాక్యం – క్రింద నుంచి పైకి (8) |
| 9) ఎక్కదగిన బండి, ఆంగ్లంలో వెహికల్ – అటు నుంచి (4) |
| 10) గృహము, ఇల్లు (4) |
| 12) మాటిమాటికి – చెల్లాచెదురయ్యింది (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 04 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 191 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 నవంబర్ 09 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 189 జవాబులు:
అడ్డం:
1) ప్రకర్షణం 4) క్వాణకము 7) జోడు 8) పాలు 9) త్తిపతిప్ర 10) ముట్టెమోపు 11) హో 12) ముక్తాస్ఫోటం 14) కడనుగ 16) రుతి 18) ద్రంసం 19) డుపశాఆ 20) గిబ్బరౌతు
నిలువు:
1) ప్రజోత్పత్తి 2) కడు 3) ణంరకప్ర 4) క్వాచిత్యము 5) కపా 6) ములుసూపు 12) ముహేరుడు 13) టంభరఆ 14) కనకాంగి 15) గలుసంతు 17) తిప 18) ద్రంరౌ
సంచిక – పద ప్రతిభ 189 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- పూర్ణకుమారి, ఒంగోలు
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

