Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 184

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నవ్వు ___ అందాల చేటనే సామెత (9)
5) నోటి మాట, ముఖస్థం, నేరుగా చెప్పిన మాట (5)
6) విడుదల, మోక్షం, (2)
7) చంద్రుడు, శివుడు, కర్పూరం, విష్ణువు, బ్రహ్మ, రాక్షసుడు (3)
8) అమాయకులకు దీనిలో నాలుక లేదంటారు (2)
11) జీతం, కూలి, భృతి (3)
12) ఆనందం పుట్టించు శుభాదికార్యము, ఆటలతో కూడిన పండుగ (5)
13) గరుడవాహనుడు (8)

నిలువు:

1) బ్రహ్మ, చతుర్ముఖుడు (9)
2) పెళ్ళిలో చివరి రోజు చేసే ఒక వేడుక, 2010లో విడుదలైన వెంకటేశ్ సినిమా (4)
3) పవిత్రమైన ఉద్దేశం, విజయం సాధించడానికి లక్ష్యం పట్ల ఇది అవసరం (4)
4) వాడుకలో జరిగే తప్పులు – క్రింద నుంచి (8)
9) తడబడిన మన్మథుడు (4)
10) క్రింద నుంచి ఒక నరకం (4)
12) శ్రేష్ఠము, ఒకానొక వేదస్వరము, ఒక యర్థాలంకారము, దానము – చివరి అక్షరం కోల్పోయింది (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 16తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 184 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 సెప్టెంబర్ 21 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 182 జవాబులు:

అడ్డం:   

1) కృతజ్ఞత 4) హేతుకము 7) తాపం 8) నిమ్మ 9) లుపులత 10) తండులము 11) శ్రీ 12) మాక్షికజం 14) వరాంగన 16) నీరు 18) కోన 19) యజత్రము 20) హితవాది

నిలువు:

1) కృతార్థులు 2) తపం 3) తలరాత 4) హేతుమంతం 5) కని 6) ముమ్మరము 12) మాననీయ 13) జంతుఘ్నము 14) వరారోహి 15) నభోనది 17) రుజ 18) కోవా

సంచిక – పద ప్రతిభ 182 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version