‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) అడ్డుపడు, ప్రతిహతమగు (4) |
4) ఇల్లు, గది, విశ్రమము, స్థానము, యాగశాల (4) |
7) భారతంలో ఈయన నీతి చాలా ప్రసిద్ధి (5) |
8) సూర్యుడు, జీవుడు (2) |
10) జ్వరము, తాపము, తపము, కోపము, వేడిమి, బాధ, ఉష్ణము (2) |
11) వ్యవహారం, కార్య విధానము, ఉపాయము, సన్నాహము (3) |
13) పరిహాసం, జాగరూకత, కలయిక, నివాసం, ఐకమత్యం, అంగడి, సంఘం, సభ (3) |
14) వ్యాయామ విద్య నేర్పేవాడు, బలశాలి, సమర్థుడు, ఉపాధ్యాయుడు (3) |
15) ఇసుక, పారే, మోసుకొనిపోయే (3) |
16) ప్రతాపం, తేజం, మహత్మ్యం, పుట్టుక, మగటిమి, శాంతి, సామర్థ్యం (3) |
18) ఏనుగు మొదలగువాటిని పట్టుకోవడానికి గడ్డితో కప్పిన గొయ్యి (2) |
21) వెనక నుంచి ముందుకు నూరు, వంద (2) |
22) కష్టకాలంలో అనుసరించాల్సిన ధర్మం (5) |
24) ఇంద్రుడు, కొండలను పగలగొట్టే పనిముట్టు (4) |
25) కనుమ పండుగకు మర్నాడు, కొందరు చివరి అక్షరానికి ఉకారం చేర్చండి (4) |
నిలువు:
1) తొందర, కళవళపాటు, చింత (4) |
2) వజ్రాయుధము (2) |
3) క్రింద నుంచి పైకి – బలరాముడి తండ్రి (3) |
4) పొందింపబడినది; తేబడినది, తెచ్చినది, తీసుకువచ్చిన (3) |
5) సన్యాసి, ఋషి, విష్ణువు, జితేంద్రియుడు (2) |
6) సంతోషము, ఆనందం, విష్ణువు ఖడ్నం (4) |
9) అడ్డదిడ్డంగా, అర్థంపర్థం లేకుండా వాదించేవాడు (5) |
10) శరదృతువు (5) |
12) సంసిద్ధత, అలంకరణ (3) |
15) నడవడి, నడత, నడపటం (4) |
17) అగరు, గంధము, ఒక రకం చెరకు, ఒక చేప (4) |
19) కష్టం, ఆపద, అగచాటు, యాతన, బాధ (3) |
20) ఆయువుపట్టు, అవయవాల సంధి, గూఢార్థం, రహస్యం, ఆలోచన, సలహా (3) |
22) చివరి మూడక్షరాలు లేని సౌందర్యము, చక్కదనము (2) |
23) తునుక, ఖండము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 09వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 183 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 సెప్టెంబర్ 14 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 181 జవాబులు:
అడ్డం:
2) పెండ్లిపిలుపు 6) లునాజ 8) లుజ్ఞాయ 10) వళి 11) ఇంకొంచెం 12) తినా 15) వేయువు 16) తమరా 17) టంగం 19) మేఘము 20) గోడు 21) ధర్మం 22) నుమా 23) గోము 24) పాముల మేతరి
నిలువు:
1) పిలువని పేరంటం 2) పెంజ 3) పిట్ట కొంచెం కూత ఘనము 4) పులు 5) నయనాభిరాముడు 7) వాళి 9) జ్ఞాతి 13) బ్రోవుము 14) మాతలి 18) గంధము 20) గోమాత 22) నుమే
సంచిక – పద ప్రతిభ 181 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.