Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 182

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) చేసిన మేలు మరవకపోవడం (4)
4) కారణము, పనిముట్టు, కారణమైన, జ్ఞాపకమైన (4)
7) వేడిమి, బాధ, (2)
8) జంభీరం, పుల్లని రసం ఉండే కాయల చెట్టు (2)
9) వెనుక నుంచి ముందుకి ఆలోచనలు (4)
10) బియ్యము (4)
11) లక్ష్మి, సరస్వతి, సంపద, (1)
12) మైనము, సిక్థకమ్‌ (చివరలో మకారం పొల్లును అనుస్వారంగా వ్రాయాలి) (4)
14) ఉత్తమ స్త్రీ, శ్రీతాళం (4)
16) నీళ్ళు, జలం, కన్నీరు, భస్మం (2)
18) అడవి, తోట, కొన, మూల, గోసమూహము (2)
19) అవిచ్ఛిన్నముగా చేయు అగ్నిహోత్రము (4)
20) మేలు కోరి చెప్పే వ్యక్తి (4)

నిలువు:

1) కృతకృత్యులు, ధన్యులు (4)
2) తపస్సు, గ్రీష్మ ఋతువు (2)
3) నొసటి రాత, లలాటలిఖితం (4)
4) కార్యము (4)
5) చూచి (2)
6) అతిశయము, ఉగ్రం, తీవ్రం (4)
12) గౌరవించదగిన (4)
13) మాదిఫలము, వాయువిడంగము, ఇంగువ (4)
14) కొబ్బరి చెట్టు (4)
15) మిన్నేరు, ఆకాశగంగ (4)
17) రోగము, చెరుపు, బాధ (2)
18) పాలతో చేసే మిఠాయి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 02తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 182 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 సెప్టెంబర్ 07 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 180 జవాబులు:

అడ్డం:   

1) శ్రద్ధావతి 4) రంగభూతి 7) మారరంజని 8) నన 10) కారు 11) ముటము 13) ముమసు 14) దుద్దులు 15) భారతం 16) వినుతి 18) రవి 21) వురు 22) పరబ్రహ్మము 24) జతుమము 25) డులడుల

నిలువు:

1) శ్రధనము 2) వమా 3) తిరము 4) రంజకం 5) గని 6) తిమ్మరుసు 9) నటభైరవి 10) కామధేనువు 12) సుద్దులు 15) భారద్వాజ 17) తిరుమల 19) సీరము 20) బ్రాహ్మడు 22) పమ 23) ముల

సంచిక – పద ప్రతిభ 180 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version