Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 181

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) వివాహా ఆహ్వానము (5)
6) ప్రజలు, కుడి నుంచి ఎడమకి (3)
8) యాగములు – వెనుక నుంచి ముందుకి (3)
10) ముడుత (2)
11) ఇంకా కొంచెం, ఇంకా కొద్దిగా (3)
12) అటూ ఇటూ అయిన స్త్రీ (2)
15) సూర్యుడు, సముద్రం, అగ్ని (3)
16) మీరా (3)
17) పార, వెలిగారం (2)
19) మబ్బు, అబ్రకము, కర్పూరం, ఒక రాగం (3)
20) దుఃఖం, ఆవేదన (2)
21) పుణ్యము, న్యాయము, స్వభావము, విల్లు (2)
22) వెనుక నుంచి ముందుకు – చెట్టు, విడుచు, (2)
23) సౌకుమార్యము, అందము, వికాసము (2)
24) గరుత్మంతుడు (6)

నిలువు:

1) ఆహ్వానం లేని వేడుకని సూచించే ఓ సామెత (7)
2) తేలికయిన (2)
3) చిన్న వయసులో గొప్ప ప్రతిభ చూపడాన్ని చెప్పే సామెత (9)
4) కసవు, మాలిన్యము, గడ్డి (2)
5) చంద్రుడు, చూడచక్కనివాడు (7)
7) వరము, కాడ, గడియ కాలము, రంధ్రము, నాళిక (2)
9) బంధువు, స్వజనుడు (2)
13) కాపాడుము, రక్షింపుము (3)
14) ఇంద్రుని సారథి (3)
18) చందనము, వాసన (3)
20) తల్లివంటి ఆవు (3)
22) తలక్రిందులయిన శరీరం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 26 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 181 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఆగస్టు 31 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 179 జవాబులు:

అడ్డం:   

1) విశ్వావసు 4) పరాభవ 7) ఏధమానము 8) గీత 10) ఉము 11) షరతు 13) ఇత్తడి 14) పర్వము 15) ద్వారక 16) పరాకు 18) పము 21) లుమా 22) ఆరాధితము 24) ముద్దరాలు 25) ముడికాడు

నిలువు:

1) విజిగీష 2) వఏ 3) సుధర్మ 4) పనస 5) రాము 6) వడముడి 9) తిరస్కారము 10) ఉత్తమురాలు 12) సర్వము 15) ద్వాపరము 17) కుమారుడు 19) ఏరాలు 20) గీతము 22) ఆరా 23) ముడి

సంచిక – పద ప్రతిభ 179 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version