Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 179

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) తెలుగు సంవత్సరాలలో 39వది (4)
4) తెలుగు సంవత్సరాలలో 40వది (4)
7) పెరుగుతున్నది, వర్ధిల్లుచున్నది (5)
8) గానం చేసేవాడు, పాట, పద్యభేదము, (2)
10) మధ్య అక్షరం కోల్పోయిన కాగడా, మిణుగురు, దీపావళి నాడు లక్ష్మీ పూజ తర్వాత వెలిగించే దీపం (2)
11) ఒడంబడిక, నిబంధన, పందెము (3)
13) రాగి జింకుల కలయికతో రూపొందే లోహం, ఆరకూటం (3)
14) పండుగ, సమూహము, ప్రస్థానము (3)
15) శ్రీకృష్ణుని నగరం (3)
16) పరధ్యానము, ఏమరుపాటు (3)
18) పాదము, చిహ్నము, శబ్దము, వాక్యము, వస్తువు, కిరణం – మధ్య అక్షరం లోపించింది (2)
21) అటు నుంచి – చెడు, నశించు (2)
22) ఆరాధింపబడినది (5)
24) ముగ్ధ స్త్రీ (4)
25) సంధానము చేయువాడు, సంధాయకుడు (4)

నిలువు:

1) జయింపవలెననెడి మిక్కిలి ఇచ్ఛ (4)
2) క్రింద నుంచి పైకి – రోత, అసహ్యం, రోషం, నీచం (2)
3) ఇంద్రసభ (3)
4) వేద భాగము, వృక్ష విశేషము (3)
5) రాముడు, రాలేము, రావడం లేదు (2)
6) భీముడు, శత్రువులకు తాపము కలిగించువాడు (4)
9) అనాదరము, తెగడిక, నిరాకరణము (5)
10) గుణవతి, ఉత్తమ స్త్రీ (5)
12) సమస్తము, అంతయు (3)
15) ఒక యుగము, సందేహము (4)
17) పుత్రుడు, కొడుకు (4)
19) తోడికోడలు (3)
20) పాట, గానము, గీతపద్యం (3)
22) ఆచూకీ తీయడం, తెలుసుకోడంలో ఆసక్తి (2)
23) గ్రంథి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 12 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 179 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఆగస్టు 17 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 177 జవాబులు:

అడ్డం:   

2) సూర్యకాంతము 6) మానికం 8) జలజ 10) వాసి 11) ఆనందం 12) క్ష్మం సూ 15) చంగము 16) తరుయా 17) డు అ 19) సముద్రం 20) బము 21) తిరు 22) కాడ 23) బోధి 24) రై 25) దిగుబడి

నిలువు:

1) అమావాస్య చంద్రుడు 2) సూకం 3) కాంచనం కర్మ విముక్తి 4) ముజ 5) రాజసూయ యాగము 7) నిసి 9) లక్ష్మం 13) కౌముది 14) హితము 18) అతిధి 20) బడబ 22) కాగు

సంచిక – పద ప్రతిభ 177 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version