Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 177

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) సూర్యరశ్మి తగులుటచే నిప్పు కలిగెడు ఒక దినుసు రాయి, ఆదిత్యశిల (5)
6) కెంపు, రత్నము (3)
8) నీటి నుంచి పుట్టునది, తామరపువ్వు, పద్మము (3)
10) తారతమ్యం, ఆధిక్యం, ప్రసిద్ధి, లాభం, బేధం (2)
11) సంతోషము, సుఖము (3)
12) అణువు, సన్నము, కొంచెం – అటు నుంచి (2)
15) నేర్పరి, చక్కనిది (3)
16) తడబడిన సిద్ధము (3)
17) అటునుంచి – చివర లేని పాదము, ప్రశ్నించు, గజములో మూడవ భాగము (2)
19) కడలి, సాగరం (3)
20) సంబరము – 2, 4 (2)
21) శ్రీప్రదమైన, పవిత్రమైన, శుభకరమైన (2)
22) తొడిమ (2)
23) రావి చెట్టు, అశ్వత్థ వృక్షము, సిద్ధార్థుడికి ఈ వృక్షం కిందే జ్ఞానోదయమైంది (2)
24) ధనము, విడిముడి (1)
25) ఫలసాయం, ఉత్పత్తి (4)

నిలువు:

1) ఏమీ కనిపించని వాడు, కమల్ హాసన్ నటించిన సినిమా (7)
2) మధ్యలో – ‘చ’ లోపించిన సూచన, జ్ఞాపకము, సూది, నక్క, కుక్క, (2)
3) బంగారం కర్మ నుంచి విముక్తి కలిగిస్తుందనే నానుడి (8)
4) అటునుంచి వచ్చిన ఒకప్పటి ప్రసిద్ధ నటి, చివర అక్షరాన్ని కోల్పోయింది (2)
5) ఒక రాజు తక్కిన రాజులను జయించి చేసేడి యజ్ఞము, భారతంలో ధర్మరాజు చేశాడు (7)
7) అర్ధరాత్రము, రాత్రి (2)
9) గుఱుతు, చిహ్నము, ముఖ్యము (2)
13) వెన్నెల, పూర్ణిమ, ఒక తెలుగు అంతర్జాల పత్రిక (3)
14) మంచి, అనుకూలమైన, ప్రియమైన, శుభమైన, మేలు (3)
18) కాలనియమము లేక అన్నార్థియై వచ్చినవాడు – చాలామంది చివరి అక్షరాన్ని తప్పుగా రాస్తారు, ఈసారికి మనమూ అలాగే రాద్దాం (3)
20) ఆడ గుఱ్ఱము, బ్రాహ్మణి (3)
22) పెద్దబాన, తపించు, కోపపడు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 29 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 177 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఆగస్టు 03 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 175 జవాబులు:

అడ్డం:   

2) మహా మఖము 6) యానము 8) స్వరాజ్యం 10) దేవి 11) కుసుంభం 12) ణవీ 15) సుమతి 16) మాతా ది 17) డులి 19) చాముండి 20) అము 21) గుప్తం 22) ఈత 23) పావు 24) నందివాహనుడు

నిలువు:

1) మాయాదేవీసుతుడు 2) మము 3) మనసుంటే మార్గముంటుంది 4) ముస్వ 5) రాజ్యంవీరభోజ్యం 7) నవి 9) రాణ 13) ప్రతిన 14) నందిని 18) లిగువు 20) అతను 22) ఈహ

సంచిక – పద ప్రతిభ 175 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version