Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 175

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) గొప్ప యజ్ఞము (5)
6) పోవుట, దండెత్తిపోవుట, ప్రయాణము, ఉత్సవము, పల్లకి (3)
8) స్వతంత్ర్య రాజ్యము (3)
10) పార్వతి, సరస్వతి, రాణి (2)
11) కుసుమపువ్వు, బంగారు (3)
12) అటునుంచి – విపంచి, మెఱపు, (2)
15) మంచి బుద్ధి కలది, ఒక పతివ్రత (3)
16) అమ్మవారు, దుర్గాదేవి, ఉత్తరాది వారి పిలుపు (3)
17) ఆడ తాబేలు, కమఠి (2)
19) సప్త మాతృకలలో ఒకరు, మైసూరులో కొలువైన దేవత (3)
20) ఈ పరబ్రహ్మ స్వరూపంలో, మధ్యలో ఒక అక్షరం పోయింది (2)
21) గూఢము, కావబడినది, దాచబడినది (2)
22) ఈదటం, ఒక చెట్టు (2)
23) నాల్గవ భాగము, వరహాలో నాల్గవ భాగము (2)
24) శివుడు (6)

నిలువు:

1) శాక్యబుద్ధదేవుడు (7)
2) మమ్ములను, మమ్ము (2)
3) మనసుంటే ఇది ఉంటుందని సామెత (9)
4) క్రింద నుంచి పైకి – సొమ్ము, ధనము, తాను, తనది (2)
5) రాజ్యం వీరులకే దక్కుతుందనే నానుడి (7)
7) చిన్నకుంట నుండి తోడిన నీరు పోవు కాలువ, కందకము, నయి (2)
9) ప్రేమ, విధము, ప్రీతి; రమణ కి వికృతి, (2)
13) ప్రతిజ్ఞ, శపథం (3)
14) కూతురు, ఆడబిడ్డ, గంగ, దుర్గ, కరక, కామధేనువు కూతురు (3)
18) బిగువు కాదు – ఆడజింక, మృగీ; హరిణీ (3)
20) ఆతడు, వాడు (3)
22) కోరిక (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 15 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 175 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూలై 20 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 173 జవాబులు:

అడ్డం:   

1) కృసరము 4) ధేనుకము 7) సనాతనుడు 8) మఖ 10) దూట 11) తితిక్ష 13) శరము 14) రాజ్యము 15) మకరం 16) శారద 18) నోము 21) ముర 22) గోమయచ్ఛత్రం 24) మహాముని 25) తపితము

నిలువు:

1) కృతమతి 2) రస 3) మునాఈ 4) ధేనువు 5) నుడు 6) ముకుటము 9) ఖతిలకము 10) దూరభారము 12) భోజ్యము 15) మనోరమ 17) దరమము 19) ఆమని 20) స్వచ్ఛత 22) గోము 23) త్రంపి

సంచిక – పద ప్రతిభ 173 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version