‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) సరస్వతి, పార్వతి, లక్ష్మి, గంగ, పూజ్యురాలు (4) |
4) హెచ్చరిక, సరైన, సూచన (4) |
7) మన దేశమాత (5) |
8) వెన్నెల అనే అర్థమిచ్చే పదంలో 1, 5 అక్షరాలు (2) |
10) భక్తి కలవాడు, భక్తుడు (2) |
11) కుడి నుంచి ఎడమకి – ధ్వని, రంతు, రవలి (3) |
13) బూది, బూడిద, ఏదైనను కాలి తెల్లగానయిన పొడి (3) |
14) భరించుట, కూలి, జీతము, ఇరువది తూముల మానము (3) |
15) వెరపు, భీతి, (3) |
16) వెనకు నుంచి ముందుకు – బంధనం (3) |
18) సమానమైనవాడే కానీ పాపం, చివర, తప్పిపోయాడు (2) |
21) బ్రహ్మదేవుడు, పూర్తిగా కనిపించడం లేదు, మనకి సగమే కనిపిస్తున్నాడు (2) |
22) జన్మరాహిత్యం (5) |
24) వెనక నుంచి ముందుకు – శుభము, మేలు (4) |
25) భాగ్యము, శుభము, కాగలది (4) |
నిలువు:
1) పార్వతి, దుర్గ (4) |
2) తిరగబడిన ‘నీ యొక్క’ (2) |
3) స్థిరము, నిశ్చితము, బోధపడినది, నెలవు, ఉనికిపట్టు (3) |
4) మధ్యలో ‘హు’ లేని బహుమతి, కానుక (3) |
5) దేముడు మన నుదుటన రాసేది (2) |
6) క్రింద నుంచి పైకి – టూకీగా, సంక్షేపంగా (4) |
9) నీది, మీది (5) |
10) హారతి కర్పూరం, కాకపోతే నాల్గవ అక్షరానికి ఒత్తు చేర్చండి (5) |
12) తెలుగు నక్షత్రాలలో రెండవది (3) |
15) తుమ్మెద (4) |
17) విరుపు, చెడగొట్టుట, మొదటి అక్షరంలో ఒత్తు లోపించింది (4) |
19) క్రింద నుంచి పైకి – అగుట, ఇల్లు, స్థానము (3) |
20) ఉజ్జ్వలంగా మండుటను సూచించే మాట, చివర్లో చల్లారి తగ్గిపోయింది (3) |
22) క్రింద నుంచి పైకి తేజస్సు (2) |
23) విమోచనము – 5, 1 (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 08 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 174 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూలై 13 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 172 జవాబులు:
అడ్డం:
1) వసుంధర 4) వలలవ 7) వషట్కృతము 8) మావ 10) వల 11) లలిత 13) వరము 14) వర్చస్సు 15) వలజ 16) వలతి 18) లుక 21) మురు 22) వర్ధమానము 24) వర్షాశనం 25) టక్కులాడి
నిలువు:
1) వనమాల 2) ధవ 3) రషతు 4) వతను 5) లము 6) వల్కలము 9) వలిమొలక 10) వరఫలము 12) వర్చల 15) వలులువ 17) తిరుముడి 19) వర్ధనం 20) వనట 22) వశ 23) ముక్కు
సంచిక – పద ప్రతిభ 172 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- టి. వెంకాయమ్మ, తెనాలి
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.