‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) పులగము (4) |
4) యూక, చీరపేను, ఆవుల మంద (4) |
7) శాశ్వతుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇతర దేవతలను ఉద్దేశించి చెప్పే మాట (5) |
8) ఒక నక్షత్రం, 27 నక్షత్రాలలో 10వ నక్షత్రం (2) |
10) దవ్వ, అరటియూచ (2) |
11) కాంతి, ఓర్పు, క్షమ, శీతోష్ణాది ద్వంద్వసహనం (3) |
13) బాణము, రెల్లు, జలము (3) |
14) దొరతనము, ఒక రాజు ఏలే దేశము (3) |
15) మొసలి, పెద్ద చేప, ఒక నిధి, ఒక రాశి, అభినయ హస్త విశేషము (3) |
16) సరస్వతి, గౌరి, ఒక తెలుగు సినీ నటి (3) |
18) వ్రతము, యజ్ఞము (2) |
21) చంద్రగుప్తుని తల్లి, ఒక గంధ ద్రవ్యం (2) |
22) కుక్కగొడుగు, పుట్టగొడుగు (5) |
24) గొప్పముని, బుద్ధుడు, మహర్షి, కొత్తిమిరి (4) |
25) కాల్చబడినది, కరిగింపబడినది, తపియించు, తపించు (4) |
నిలువు:
1) విద్వాంసుడు (4) |
2) భూమి, స్త్రీ, రసాతలము, నాలుక, అందుగు, (2) |
3) క్రింద నుంచి పైకి బహుమతి పరభాషలో (3) |
4) స్త్రీ, లేగటి ఆవు, ధేనుక (3) |
5) గొప్పవాడే గాని పాపం ముందరే గొప్పదనం పోయింది, సూర్యుడే గాని మొదలే తేజం, కాంతి పోయాయి (2) |
6) నారబట్ట, కిరీటము (4) |
9) సూర్యుడు, భాస్కరుడు (5) |
10) మిక్కిలి దూరము (5) |
12) భుజింపదగినది (3) |
15) గోరోచనం, మేరువు కూతురు(4) |
17) విల్లు, ధనస్సు, (4) |
19) వసంత ఋతువు, ఫలసమృద్ధి, ఉత్సవం, ఒక సినీ నటి (3) |
20) పరిశుభ్రత, పవిత్రత, స్పష్టత (3) |
22) శ్రమ యెరుగని తనము, సౌకుమార్యము (2) |
23) దాలి, పిడకల ప్రోగు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 01 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 173 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూలై 06 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 171 జవాబులు:
అడ్డం:
1) అనంత విజయం 4) నందకము 8) ధర్మం 9) చదరంగము 11) జాము 13) ముగురు 15) అర్ణవం 16) ఆరాధన 18) మగువ 19) జాతుషము 20) వనజ 21) అపూపం 24) శరం 25) లుకలుకలు 26) యాత్ర 29) వుపూల్లెమ 30) ఆముక్తమాల్యద
నిలువు:
1) అగాధము 2) తర్కం 3) జన్నిదము 5) దన్ను 6) ముసిముసినవ్వు 7) బంగరు 10) రంగు రంగుల పూలు 12) వర్ణపుషము 14) నీరాజనము 17) అజాతశత్రువు 21) అకము 22) పంకజము 23) మిత్రవింద 27) పల్లె 28) రామా
సంచిక – పద ప్రతిభ 171 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య, టి., తెనాలి
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.