‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) భూమి (4) |
4) ఏడ్చుటయందగు ధ్వన్యనుకరణము, రెండు రెండు అక్షరాలు తారుమారు (4) |
7) హవిస్సు, దేవత నుద్దేశించి అగ్నిలో వేల్చినది, హోమంలో వషట్కారం చేస్తూ వేసే హోమ ద్రవ్యం (5) |
8) మామ కి రూపాంతరం, మేనమామ, తల్లి యొక్క సోదరుడు, భర్త తండ్రి, భార్య తండ్రి (2) |
10) చేపలను పట్టెడు జాలము (2) |
11) పార్వతి, అంబ, లక్ష్మి (3) |
13) కుంకుమపువ్వు, దేవతాదుల వలన పొందబడు కోరిక, వరించుట, ఒక నిధి, (3) |
14) తేజము, రూపము (3) |
15) భూమి, చక్కని చూపులు గల స్త్రీ (3) |
16) స్థానము, నేర్పరి, స్త్రీ (3) |
18) లుకలుకలు అనే మాటకు ఏకవచనము (2) |
21) చేతికి ధరించెడు స్వర్ణకంకణము, చివరి అక్షరం లేదు (2) |
22) ఆముదము చెట్టు, మూకుడు, వృద్ధి పొందింపబడినది, విష్ణువు (5) |
24) రాజులు మున్నగువారు కవిపండితులకు సంవత్సరమున కొకమారు ఇచ్చెడి గ్రాసద్రవ్యము (4) |
25) టక్కులు చేయునది (4) |
నిలువు:
1) ఆకులు, పూవులు కలిపి కట్టిన తోమాలె (దండ, హారము) (4) |
2) చంపుట, వధము – క్రింద నుంచి పైకి (2) |
3) నిబంధన, తారుమారు అయింది (3) |
4) వాడుక, రివాజు, మామూలు, పరిపాటి (3) |
5) మొదలు లేని తోక, జలము (2) |
6) నార చీర, చెట్టు, చెట్టు పుట్ట, చీరము, ముకుటము (4) |
9) భీముడు, వాయుపుత్రుడు (5) |
10) కొబ్బరికాయ, కొబ్బరిచెట్టు (5) |
12) హనుమంతుని భార్య, మొదటి అక్షరం లేదు (3) |
15) వస్త్రములు, అన్నీ కలిసిపోయి, చెదిరిపోయి, కలగాపులగం అయ్యాయి (4) |
17) వైష్ణవుడు (4) |
19) పెరుగుట, పెరుగునది, నఱకుడు (3) |
20) వనరుట, శోకము, వగపు (3) |
22) ఆడ ఏనుగు, గొడ్డుటావు, ఆవు, కూతురు (2) |
23) నాసిక, మూలుగు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 24 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 172 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూన్ 29 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 170 జవాబులు:
అడ్డం:
2.రామరాజ్యము 6. చమసి 8. రసాల 10. క్షమ 11. ప్రక్రియ 12. మీరు 15. రకరకాల పద్ధతులు 16. తంప 18. సీసము 19. ఊడు 20. సుధ 21. ఈహ 22. దాపు 23. దండపాంసులుడు
నిలువు:
1.విచక్షణారహితం 2. రాసి 3. రాధాక్రిష్ణుల రాసక్రీడ 4. ముర 5. అలరువిలుకాడు 7. మమ 9. సామీ 13. మారట 14. ఉద్ధవం 17. పసుపు 19. ఊహలు 21. ఈసు
సంచిక – పద ప్రతిభ 170 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- టి. వెంకాయమ్మ, తెనాలి
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.