‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) ధర్మరాజు యొక్క శంఖము (6) |
4) విష్ణువు యొక్క ఖడ్గము (4) |
8) పుణ్యము, న్యాయము, సామ్యము, స్వభావము, ఆచారము, అహింస, ఉపనిషత్తు, యజ్ఞము, పిల్ల (2) |
9) బిందుతంత్రము, ఒకానొక ఆట (5) |
11) ఏడున్నర గడియల కాలము (2) |
13) మువ్వురు, ముగ్గురు (3) |
15) సముద్రము, కడలి (3) |
16) పూజ, అర్చన, ఆరాధించుట (4) |
18) ఇంతి, స్త్రీ (3) |
19) జతువు వలన కలిగినది, (జతువు = లక్క) (4) |
20) జలంలో, అరణ్యములో పుట్టునది, ముస్తకము, గజము, తామర (3) |
21) పిండివంట (3) |
24) బాణము, సిగ్గు, జలము, మీది పెరుగు (2) |
25) క్షుద్రక్రిముల బాహుళ్యాన్ని సూచించడానికి ఉపయోగించే ధ్వనికి; కుటుంబం, రాజకీయపార్టీ మొదలుగు వాటిలో విభేదాలు తలెత్తటంలో ధ్వనికి ఉపయోగించే పదం (5) |
26) జాతర, పోవుట, పుణ్య క్షేత్రములకు వెళ్ళుట (2) |
29) వెనుక నించి ముందుకు కుటజము, చంద్రిక, మృగేష్టము (4) |
30) శ్రీకృష్ణదేవరాయ విరచితము (6) |
నిలువు:
1) మిక్కిలి లోతు గలది (4) |
2) ఒక శాస్త్రము, ఊహ, అధ్యాహారము, కారణము, కోరిక (2) |
3) యజ్ఞపవీతము (4) |
5) సహాయము, ఆసరా, బలము, నిలుపుచోటు, ప్రాపు (2) |
6) చిఱునవ్వు, దరహాసము (6) |
7) బంగారము, సువర్ణము, కనకము (3) |
10) అనేక రకాల రంగుల పువ్వులు (7) |
12) వన్నెచెట్టు, నాలుగవ అక్షరము ‘ష’ క్రింద ’ప’ వత్తు లేదు (5) |
14) ఆరతి, మంగళ హారతి (5) |
17) శత్రువులు లేనివాడు, ధర్మరాజు (6) |
21) దుఃఖము, పాపము (3) |
22) తామర, అసలుఁబుట్టువు (4) |
23) శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు, అందరితో చాలా స్నేహంగా వుంటుంది, మగధీర సినిమాలో హీరోయిన్ పూర్వ జన్మలోని పేరు (4) |
27) జాతి విశేషము. బడి, చిన్నవూరు, పల్లియ (2) |
28) శ్రీరాముడి గాథని తెలిపే పవిత్రమయిన పౌరాణిక గ్రంథము, కాని చివరి రెండు అక్షరాలు లేవు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 17 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 171 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూన్ 22 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 169 జవాబులు:
అడ్డం:
1) ప్రతిజ్ఞాతం 4) షాజహాను 7) త్యాగి 8) హాస 9) యంత్రాంగము 10) ముప్పొత్తులు 11) వ్రే 12) మధ్యమిక 14) అకిల్బిష 16) రిక్ష 18) మామ 19) మణిభిత్తు 20) ముసలము
నిలువు:
1) ప్రత్యామ్నాయం 2) తిగి 3) తంత్రణము 4) షాడ్గుణ్యము 5) హాహా 6) నుసములు 12) మధురిమ 13) కసరత్తు 14) అక్షోభము 15) షడ్జమము 17) క్షణి 18) మాల
సంచిక – పద ప్రతిభ 169 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య. టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.