Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 169

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ప్రతిశ్రుతము, ప్రతిజ్ఞ చేయబడినది, అంగీకరింపబడినది (4)
4) మొఘల్ చక్రవర్తి, జహంగీరు కుమారుడు (4)
7) దాత, శూరుడు, ఇచ్చేవాడు, విడుచువాడు (2)
8) హాస్యము, నవ్వు; నూతనము, క్రొత్తది (2)
9) పనులు నిర్వహించే వ్యవస్థ (4)
10) మూడు పొత్తులు (4)
11) ఆభీరకులం; గోపాలకులం (1)
12) వయసు వచ్చిన పడుచు (4)
14) తప్పు లేదా పాపం చేయని స్త్రీ (4)
16) దీర్ఘం లోపించిన ఒక వాహనం (2)
18) తల్లి సోదరుడు, మాతులుడు, శ్వశురుడు (2)
19) వజ్రపుముక్క, రత్నపుముక్క (4)
20) రోకలి, అయోగ్రము (4)

నిలువు:

1) బదులు, వైదికములందు ప్రతినిధిగా విధింపబడినది (4)
2) వాననీళ్లు చెరువులోకి వచ్చు వైపు (2)
3) తంత్రము కాదు, పనులు సక్రమంగా చేయడం, (4)
4) ఐశ్వర్యవీర్యాది భగవంతుని ఆరు గుణాలు, గుణషట్కము (4)
5) దుఃఖమును తెలుపునది, ఆశ్చర్యమును తెలుపునది; ఒక గంధర్వరాజు (2)
6) ఎండాకాలంలో కళ్ళపై ముసరెడు చిన్న దోమలు (4)
12) తియ్యన, మధురము (4)
13) అభ్యాసం, వ్యాయామము, సాధన (4)
14) కలత లేమి, ఏనుగును కట్టు స్తంభము (4)
15) సప్తస్వరములలో ఒక స్వరం, చాలామంది తప్పుగా ఇలా పలుకుతారు (4)
17) రాత్రి, చివరి అక్షరం లోపించించి (2)
18) పూలదండ, కంఠాభరణం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 03 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 169 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూన్ 08 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 167 జవాబులు:

అడ్డం:   

2) భోగి పండుగ 6) నగరు 8) సమిధ 10) కాయ 11) నభము 12) లువు 15) రామక్రిష్ణపరమహంస 16) డులి 18) తమాషా 19) సలు 20) గుప్తం 21) కర 22) పావు 23) కలువలదాయ

నిలువు:

1) పానకాలరాయడు 2) భోరు 3) పంచభక్ష్యపరమాన్నాలు 4) గస 5) మాధవునిసతులు 7) గయ 9) మిలు 13) చక్రిక 14) వామన 17) లిగువు 19) సరదా 21) కల

సంచిక – పద ప్రతిభ 167 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

Exit mobile version