‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2) దొంగ జపం, చేపల కోసం బకం చేసేది (5) |
6) వ్యాకులత, క్షోభ, పాపం (3) |
8) భూమి, ఒక వృత్తం, ఒక ఛందస్సు (3) |
10) కల్లు, మద్యం, మోటబావి, మదము పట్టినది (2) |
11) సప్తమాతృకలలో ఒక మాతృక, ‘చా’ తో మొదలు (3) |
12) లక్ష్మీదేవి, సంపద, శోభ (2) |
15) ముంజి, కసపు, పవిత్రమైనది, పూతము, యవధాన్యము, (3) |
16) శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినది (5) |
17) సంపాదన, లాభం, పోయిన దానిని తిరిగి సంపాదించుట (2) |
19) నకులము, చెల్లాచెదురయింది (3) |
20) నడి, మధ్యము, పద (2) |
21) విజృంభణము, శౌర్యము (2) |
22) సీతాపతి (2) |
23) విష్ణువు, చంద్రుడు, పండితుడు, యముడు (2) |
24) ఆదరించువారు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయువారు (6) |
నిలువు:
1) అందరూ కలిసిమెలసి ఉండి, ఒకరికొకరు సహాయం చేసుకుంతూ ఉంటే, అదే అందరికీ మంచిది, బలం కూడా (7) |
2) కొంచెము, స్వల్పము (2) |
3) గెలుపు ఉన్నప్పుడు వెరపు ఉండదు అని చెప్పడం (9) |
4) గజ్జె, రెండో అక్షరానికి ఒత్తు లేదు (2) |
5) నీచ సేవకుడు. నెత్తి బరువు మోయు కూలివాడు (7) |
7) దెబ్బ (2) |
9) మద్యము, గాలిసుడి, గాలి, పెద్ద, వేలుపు, దేవతలకు సంబంధించినది (2) |
13) పీఠాధిపతులు, మతాచార్యులు, అధికారులు, ప్రభుత్వం వారు (3) |
14) శుభము, సుఖము, జలము, వేదము (3) |
18) కోశాధికారి, ఉత్తర భారతదేశంలోని, నేపాల్ లోని హిందువులలో ఒక ఇంటిపేరు (3) |
20) కింద నుంచి పైకి – పొట్టిది, పొట్టివాడు, దక్షిణపుదిక్కునందలి ఏనుగు (3) |
22) రాలేను, రావడం లేదు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 27 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 168 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూన్ 01 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 166 జవాబులు:
అడ్డం:
1) సభాపతి 4) కకుద్మతి 7) సతీ సుమతి 8) కృతి 10) అమ 11) తిమ్మప్ప 13) జీరిద 14) ధీమతి 15) రాబంగా 16) ర్థతాకృ 18) మతి 21) తితి 22) అమరావతి 24) తిరుపతి 25) సరస్వతి
నిలువు:
1) సత్యాకృతి 2) పస 3) తితీప్ర 4) కమఠి 5) కుతి 6) తియంమద 9) తిమ్మనబంతి 10) అరిష్టతాతి 12) శ్రీమతి 15) రామసతి 17) కృతిపతి 19) హమతి 20) తివస 22) అప 23) తిర
సంచిక – పద ప్రతిభ 166 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాదు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.