‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2) సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ (5) |
6) రాజగృహము, అంతఃపురము, దేవగృహము, కొలువుకూటము (3) |
8) చిదుగు, వంటచెరకు (3) |
10) చెట్టుకు కాసేది, పండక ముందర పచ్చిగా ఉండేది (2) |
11) ఆకాశము, శ్రావణ మాసము (3) |
12) ఇంగ్లీషులో వెళ్ళు అనే అక్షరం లేని ఆవులు, అటు నుంచి (2) |
15) ఈ క్రిష్ణులు – వివేకానందుని గురువుగారు (9) |
16) ఆడ తాబేలు, కమఠి (2) |
18) చమత్కారం, వేడుక, గమ్మత్తు (3) |
19) నకలు కానిది, కాని పాపం మొదలే లేదు (2) |
20) కావబడినది, దాచబడినది (2) |
21) తీరము, ఆవరణము, అల, తీక్ష్ణము (2) |
22) నాల్గవ భాగము, రెండు చవలములు (2) |
23) సూర్యుడు, కలువల శత్రువు (6) |
నిలువు:
1) మంగళగిరిలోని నరసింహస్వామిని భక్తులు ఇలా పిలుచుకుంటారు (7) |
2) తీవ్రధ్వని (2) |
3) అయిదు రకాల పిండివంటలతో, భోజనపదార్థాలతో విందు చేయడమంటే ఇవి వడ్డించినట్టు (9) |
4) ఉబ్బసం, ఆయాసం (2) |
5) శ్రీకృష్ణుని భార్యలు (7) |
7) బీహారు రాష్ట్రము లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రము (2) |
9) చేపలు, మీన కి వికృతి (2) |
13) చక్రం కాదు, మోకాలు (3) |
14) లేత చింతకాయకి ఉన్న మరో పేరులో మొదటి మూడు అక్షరాలు, పొట్టిది, పొట్టివాడు (3) |
17) గురువులిద్దరు – 4, 1, 3 (3) |
19) వినోదము, సంతోషము, వేడుక (3) |
21) స్వప్నము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 20 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 167 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మే 25 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 165 జవాబులు:
అడ్డం:
1) శ్రీగంధము 4) అయోముఖి 7) సంత 8) వాది 9) ముసాంబ్రము 10) ముకుందుడు 11) పై 12) కోద్రంగము 14) పటాటోపం 16) గఈ 18) శంయ 19) రంహణము 20) వనస్పతి
నిలువు:
1) శ్రీసంజ్ఞము 2) గంత 3) ముడేకము 4) అన్వర్థము 5) మువా 6) ఖిదిరుడు 12) కోజాగరం 13) ముహూర్తము 14) పరాభవ 15) పంచాయతి 17) ఈహ 18) శంస్ప
సంచిక – పద ప్రతిభ 165 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాదు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.