Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 166

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సమాజనాయకుడు, కుమారస్వామి (4)
4) పిరుదు, మొల (4)
7) ఒక పతివ్రత, సగరుని భార్య (5)
8) ప్రబంధము, యత్నము, ధన్యుడు, నేర్పరి (2)
10) అమ్మ, అమావాస్య, అశుభం, కీడు (2)
11) వేంకటేశ్వర స్వామి (3)
13) సాగి, తిరగబడిన కుట్టుపనివాడు (3)
14) బుద్ధిమంతురాలు (3)
15) గొప్పతనం, వాత్సల్యం, ప్రేమ – చెల్లాచెదురయింది (3)
16) కృతార్థుడు సంస్కృతంలో, అటునుంచి (3)
18) బుద్ధి, తెలివి (2)
21) ఓర్పు, చివరి అక్షరం కోల్పోయింది (2)
22) ఇంద్రుని పట్టణం, రాజధాని (5)
24) ఏడు కొండలవాడు కొలువైన ఊరు (4)
25) చదువుల తల్లి, వాణి (4)

నిలువు:

1) క్రయవిక్రయములు గట్టిమాట, బయానా, జట్టి, సంచకారము (4)
2) సారము, సమృద్ధి, కాంతి. సత్త,  (2)
3) ఎరుక, ప్రసిద్ధి, ఆదరము, సంతోషము – కింద నుంచి పైకి (3)
4) ఆడ తాబేలు (3)
5) ఉత్కంఠ, ఆసక్తి, శోకము, కుతిల (2)
6) నల మహారాజు భార్య – క్రింద నుంచి వచ్చింది (4)
9) కోతి ఆహారము, గొప్ప కలహము జరుగుచున్న చోటు (5)
10) మేలు చేయువాడు, శుభంకరుడు (5)
12) భార్య, భాగ్యవంతురాలు (3)
15) జానకి, సీత (4)
17) కావ్యమును అంకితము గైకొన్నవాడు, కృతిభర్త (4)
19) నారదుని వీణ, చెదిరింది (3)
20) సపత్ని, కింద నుంచి వచ్చింది (3)
22) విరుద్ధార్థము నిచ్చు ఉపసర్గము (2)
23) క్రింద నుంచి పైకి – ఆనందం, చంద్రుని పదహారు కళలో ఒకటి, మన్మథుని భార్య (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 13 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 166 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మే 18 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 164 జవాబులు:

అడ్డం:   

1) ఉత్తర కుమార ప్రజ్ఞలు 6) పలాయన మంత్రం పఠించు 7) తథ్యం 8) సోముడు 9) సౌధం 12) లక్షణ 13) లక్షాధికారా 14) ట్టుపెలుకుడుదుడుఒ

నిలువు:

1) ఉల్లి పది తల్లుల పెట్టు 2) రసాయనం 4) ప్రతాపము 5) లుక్కచులోధంపరాతా 10) ప్రాణములు 11) అధికుడు 13) లవుడు

సంచిక – పద ప్రతిభ 164 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

Exit mobile version