‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) మంచి గంధము (4) |
4) శూర్పణఖ కన్నా ముందే లక్ష్మణుడు ముక్కుచెవులు కోసిన రాక్షస స్త్రీ (4) |
7) నిర్ణయింపబడిన దినమునందుంచెడి అంగళ్ళ వరుస, వేదపాఠము (2) |
8) తగవుకు పోయినవాడు, వక్త, ప్రతిపక్షుడు (2) |
9) ఒక మందు దినుసు (4) |
10) విష్ణువు (4) |
11) ఉపరిభాగం, మీద, a mathematical constant (1) |
12) మంచె, తనుంగము (4) |
14) వస్త్రాడంబరము, ఆర్భాటం, డాబు, హంగామా (4) |
16) తిరగబడిక మక్షిక (2) |
18) వెనుక నుంచి ముందుకు వచ్చిన కీర్తి (2) |
19) వేగముగా పోవుట (4) |
20) పూలు పూయకనే కాచెడి చెట్టు, వనమునకు భర్త (4) |
నిలువు:
1) లవంగము (4) |
2) బొంత, పోవువాడు, పొందువాడు, (2) |
3) ఏగాని (4) |
4) సార్థకము, పొసగిన అర్థము కలది (4) |
5) కింద నుంచి పైకి వచ్చిన ఓమము (2) |
6) చంద్రుడు, తపస్వి, దరిద్రుడు (4) |
12) ఆశ్వయుజపూర్ణిమ, శరత్పూర్ణిమ (4) |
13) పన్నెండు క్షణముల కాలము (4) |
14) అవమానము, తెలుగు సంవత్సరాలలో 40వది (4) |
15) న్యాయము తీర్చుటకై మధ్యస్థముగా నేర్పడిన అయిదుగురి కూటమి (4) |
17) కోరిక (2) |
18) కింద నుంచి పైకి వచ్చిన యుద్ధము, పోరు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 06 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 165 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మే 11 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 163 జవాబులు:
అడ్డం:
1) ఆచంద్రతారార్కము 5) ఆలు 6) కుఆ 8) మాడ 9) బరి 11) రక్షితము 12) లవకుశ 13) ధీ 14) పలుకుము 18) ఆషామూషి 20) నవాసార 21) లత 22) మున 23) ఆకాశస్ఫటికము
నిలువు:
1) ఆలు 2) ద్రవిడము 3) రాజబల 4) ముకు 5) ఆకారగోపనము 7) ఆకాశభాషితము 8) మాత 10) రివ 15) లువానఆ 16) కుసా 17) మురతాశ 18) ఆరకాటి 19) మూల
సంచిక – పద ప్రతిభ 163 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాదు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.