Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 163

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు ఉన్నంత వరకు (7)
5) భార్య, స్త్రీ, ఆడుది (2)
6) వెనక నుంచి ముందుకి దళం, పత్రం (2)
8) అరవరా, సువర్ణము, వరహాలో సగం (2)
9) పార్శ్వము, బరిగోల, బడి, శత్రువు (2)
11) రక్షింపబడినది (4)
12) సీతారాముల కుమారులు, వారి పేర సినిమా (4)
13) బుద్ధి, మతి (1)
14) మాటలాడుము (4)
18) అశ్రద్ధ, వివరణము లేమి (4)
20) ఒక దినుసు ఉప్పు, నవక్షారము – చివరి అక్షరం లోపించింది (4)
21) తీగ, ముత్యాలహారము, కొమ్మ, కస్తూరి (2)
22) శిగ్రూవృక్షము – చివర కోల్పోయింది (2)
23) వడగల్లు, వానరాయి (7)

నిలువు:

1) ఆవులు, గోవులు, బంగాళ దుంపని _ _ గడ్డ అని కూడా అంటారు (2)
2) దక్షిణ దేశము, తమిళము (4)
3) గొంతెమగోరు చెట్టు (4)
4) నాసిక, చివరి అక్షరానికి ఒత్తు లేకున్నా అర్థం మారదు (2)
5) ఆకారగుప్తి, శరీరంలో వచ్చిన మార్పులు ఇతరులకు తెలియకుండా దాచుకోవడం (7)
7) ఆకాశవాణి, నాటకములలో ఒక పాత్ర (7)
8) తల్లి, అమ్మ, లక్ష్మి, పారవి, భూమి (2)
10) క్రింద నుంచి పైకి ఒక పంట, సస్య విశేషము (2)
15) క్రింద నుంచి పైకి – గురుతు, ఆనాలు (4)
16) క్రింద అనుంచి పైకి – నెపం, వ్యాజము, పెంచు (2)
17) క్రింద నుంచి పైకి వజ్రాయుధము (4)
18) ఓడ నడిపేవాడు, నావికుడు (4)
19) కోణము, గొంది, కొప్పు, ఒక నక్షత్రము, విదిక్కు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 22 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 163 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఏప్రిల్ 27 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 161 జవాబులు:

అడ్డం:   

1) సమున్నతి 4) ధ్వాంతమణి 7) భక్తి 8) నుమ 9) కపర్దము 10) షంశేవఅ 11) జై 12) ఉచ్చైశ్రవం 14) నిగ్రహము 16) యతి 18) అంక 19) మురుగులు 20) ముద్గరము

నిలువు:

1) సభర్తృక 2) ముక్తి 3) తిమ్మనము 4) ధ్వాంతోన్మేషం 5) మను 6) ణిమభ్రఅ 12) ఉచ్చయము 13) వందనాలు 14) నిచోళము 15) ముడేకము 17) తిరు 18) అంర

సంచిక – పద ప్రతిభ 161 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version