Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 159

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) వైష్టవ భక్తిగీతము, గోదాదేవి పాడినది (4)
4) పాపి, పాప బుద్ధి ఉన్నవాడు చెల్లాచెదురయ్యాడు (4)
7) గరుత్మంతుడు, నెమలి (5)
8) పోస్టు, తపాలా (2)
10) గానం, గేయం, సంగీతం, పదము (2)
11) పావకోళ్ళు, పాదుకలు, కాలిజోడు (3)
13) అడుగు, చరణము, వెలుగు, కిరణము (3)
14) పూరిపాక, హీనుడు, ఆకుటిల్లు, ఓరపాక (3)
15) ఆవలి దరి, సమీపము (3)
16) గానం చెయ్యి, చివరి అక్షరం లేదు (3)
18) ప్రముఖ నటుడు గోపీచంద్ సినిమాలు – తొలి వలపు, రణం – పేర్ల లోని రెండవ అక్షరాలు (2)
21) ఒక రకం కాయధాన్యం, పప్పు దినుసు, కంద దుంప, కంతి (2)
22) పెండ్లికొడుకు, పాణిగ్రహణం చేసుకునేవాడు, మగడు, భర్త, (5)
24) చెడ్డ పని (4)
25) పామ – తో మొదలయ్యే గంధకం (4)

నిలువు:

1) అటూ ఇటూ అయిన పాటపాట (4)
2) క్రింద నుంచి పైకి వచ్చిన ఒక పనిముట్టు, ఒకానొక చేప, ఒక నది (2)
3) క్రింద నుంచి పైకి వచ్చిన దోషము, కీడు, దృష్కృతము, అమంగళం (3)
4) పాపమును తొలఁగించునది, తిలలు (3)
5) పారివాడు – లో 4, 2 (2)
6) గిన్నె, చిరిగిన గుడ్డ, చిక్కినది (4)
9) పద్య చరణాన్ని పూరించటాం, పడికట్టు మాట (5)
10) అందె, నూపురం (5)
12) చెట్టు, కాళ్ళుంచుకునే పీట (3)
15) అతను మీ పాలేరా, సేవకుడా, పనివాడా అని అడగటం (4)
17) ఎనభై గవ్వల ఎత్తు పరిమాణము గల రాగినాణెం, పాతిక కొలదిగల (4)
19) సంస్కృతవ్యాకరణకర్త. అష్టాధ్యాయి రచయిత (3)
20) మాం పాహి – తడబడి, మధ్యలో సాగింది (3)
22) పసిపిల్ల, శిశువు (2)
23) మీ యొక్క, వారి వారి స్వంతం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మార్చ్ 25 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 159 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మార్చ్ 30 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 157 జవాబులు:

అడ్డం:   

2) అంశుమత్ఫల 6) ముకుందం 7) తవిభ 8) ముది 9) కుసుంభం 10) ల్లుము 13) చుట్టాలు 14) జాగర్త 15) నుపే 17) అలు 18) రిక్త 19) మహ 20) నేమి 21) ఆదిత్యవారము

నిలువు:

) మోము ముడుచుకొను 2) అందం 3) మనసుంటే మార్గముంటుంది 4) లత 5) శుభముహూర్తములు 11) మాలుసు 12) సజావు 16) పేరిమి 17) అహర 19) మవా

సంచిక – పద ప్రతిభ 157 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version