Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 158

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) —- —- అందరూ మొనగాళ్ళే అని సామెత (7)
7) వెనక నుంచి ముందుకు వచ్చిన అర్థం – స్పృశించరు, ముట్టుకోరు, అంటుకోరు (3)
8) ధాన్యం పై పొట్టు, ఇంటి వాసాలకు పట్టే బూజు (3)
9) మల్ల యుద్ధంలో ఒక పట్టు, తాంబూలపుఁజుట్ట (2)
10) లక్ష్మి, వికృతిలో రెండో అక్షరానికి ఒత్తు పోయింది (3)
11) సుగంధి ద్రవ్యముల నుండి వచ్చు పొగ (2)
14) వెనుక నుంచి ముందుకు వచ్చిన – గతి, ఉండే చోటు, శక్తి, సత్తువ (3)
15) మళ్ళడం, నివర్తనం (5)
16) సహాయం, సోదరి, సోదరుడు, పెరుగు కావడానికి వేసే మజ్జిగ, ఆన ఒట్టు (2)
17) మొదలు లేని 1+1 లక్షలు (4)

నిలువు:

2) ధ్రువ నక్షత్రం/ధృవ నక్షత్రం – మరోలా, మొదటి అక్షరంలో ఒత్తు కోల్పోయింది (4)
3) నకిలీ బంగారానికి మెరుపు ఎక్కువ అనే సామెత (9)
4) బియ్యపునూక వేచి వండిన బూరె, పింగళి సూరన కళాపూర్ణోదయంలో కథానాయకుడైన కళాపూర్ణునకు వడ్డించిన భోజనంలో ఇవి ఉన్నాయి (సప్తమాశ్వాసం, 80వ పద్యం). (4)
5) కరుణశ్రీ గారి ఒక రచన (7)
6) – – – – – – – చేతిలో పెట్టినట్టు, విస్పష్టము చేయుటను వివరించే సామెత (7)
12) కరకు హృదయం కలవాడు, దుష్టుడు (4)
13) తప్పు చేసిన వారిని కూడా మన్నించే గుణం, కిందనుంచి (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మార్చ్ 18 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 158 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మార్చ్ 23 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 156 జవాబులు:

అడ్డం:   

1.ప్రశాంతము 4. సంహతము 7. మాత 8. మఖ 9. చమత్కారం 10. నందయంతి 11. ఓం 12. సజ్జకము 14. నందిగ్రామం 16. యామం 18. తేమ 19. గంధర్వులు 20. తిరుపతి

నిలువు:

1.ప్రమాదీచ 2. శాంత 3. ముఖద్వారం 4. సంస్తంభనం 5. తమ 6. ముఖప్రీతి 12. సర్పయాగం 13. ముల్లోకాలు 14. నందదతి 15. మందమతి 17. మంధ 18. తేప

సంచిక – పద ప్రతిభ 156 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version