‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2) అరటి చెట్టు (5) |
6) పాదరసం, ఒక జాతి మాణిక్యం, కుబేరుని నవనిధులలో ఒకటి (3) |
7) అటునుంచి వచ్చిన భవిష్యత్తు (3) |
8) ముసలితనం, ముదిరిన (2) |
9) కుసుమ పువ్వు, కమండలం, బంగారం (3) |
10) తిరగబడిన కంటకము, త్రాసుముల్లు (2) |
13) బంధువులు (3) |
14) జాగ్రత్త అనే పదాన్ని కొందరు తప్పుగా, ఇలా పలుకుతారు (3) |
15) అటునుంచి వచ్చిన యూకము, తలలో పెరుగు సూక్ష్మప్రాణి (2) |
17) చివరి అక్షరం లేని లోకువ (2) |
18) చాంద్రమానమున చతుర్ధి, నవమి, చతుర్దశి, తిథుల పేర్లతో ఏదయినా; అడవి, వట్టి (2) |
19) గోవు, తేజము (2) |
20) బండిచక్రముకమ్మి, వజ్రాయుధము, చక్రి (2) |
21) ఆదివారము (6) |
నిలువు:
1) కోపగించు, మొహము ముడుచుకును (7) |
2) సౌందర్యము, చక్కదనము, అలంకారం, విధం (2) |
3) మనసు, మార్గంలతో ఓ సామెత (9) |
4) తీగ, కొమ్మ, సన్నని స్త్రీ, గరిక (2) |
5) ఏదైనా శుభకార్యం చేయడానికి చూసే మంచి సమయాలు (7) |
11) పుష్పములు – తారుమారయ్యాయి (3) |
12) స్పష్టమైన, క్రమమైన (3) |
16) గౌరవము, అతిశయము, ప్రేమ (3) |
17) చివర ‘మనం’ లేని ప్రతిదినం (3) |
19) క్రింద నుంచి పైకి వచ్చిన ఉత్తమ స్త్రీ, శివుడు, మన్మథుడు, ధనము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మార్చ్ 11 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 157 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మార్చ్ 16 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 155 జవాబులు:
అడ్డం:
1.గజకచ్ఛపపోరుచందం 7. తతి 8. దాడి 9. వేదం 10. నవ 12. లక్ష్మణుడు 13. ముక్తసరు 14. శ్రీ 15. రంగసా 18. అటమట 21. బంగారము 22. ణడుగకు 23. ధని 24. మాకందవనం
నిలువు:
1.గత కాలము 2. జతి 4. పోసనము 5. చందా 6. దండి పైరు పంటకు రాదు 9. వేణు 11. వక్త 15. రంగాని 16. గర 17. సాముద్రికం 18. అణకువ 19. టడు 20. మగ 21. బంధనం
సంచిక – పద ప్రతిభ 155 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.