Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 155

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గజేంద్రమోక్షము అనెడి ఓ పురాణ గాథ లోని ఏనుగు, తాబేలు యొక్క కలహం లాగా (9)
7. సమూహము, వరుస (2)
8. దండయాత్ర, సేన, గడ్డము, ఔన్నత్యము, దానిమ్మపండు (2)
9. తొలి చదువులు, జ్ఞానము, ఆది శ్రుతులు (2)
10. జిల, దురద (2)
12. శ్రీరాముని సోదరుడు, సుమిత్ర కుమారుడు (4)
13. సంగ్రహమైన, సంక్షేపంగా, టూకీగా (4)
14. లక్ష్మి, సంపద, వృద్ధి, శోభ, విషము, పార్వతి, సరస్వతి, మారేడు చెట్టు (1)
15. సముద్రం, కడలి – వెనుక నుంచి ముందుకి (3)
18. వంచన, అసత్యము, దుఃఖము, వ్యర్థము (4)
21. కనకము, సువర్ణము (4)
22. చెల్లాచెదురైన గణకుడు (4)
23. ధనము కలవాడు, సంపన్నుడు (2)
24. మామిడి తోట (5)

నిలువు:

1. జరిగిపోయిన కాలము (5)
2. గాననాట్యయోగ్య శబ్దసంతతి, గీతభేదము (2)
4. పాలు, క్షీరము, కాంతి, పైపూత (4)
5. ఉపహారము, నియతకాలమందిచ్చెడు విరాళము (2)
6. గుజరాత్‍లో ఉప్పు సత్యాగ్రహం ముగిసిన ఊరితో మొదలయ్యే వ్యవసాయ సామెత (9)
9. పిల్లనగ్రోవి చివర విరిగిపోయింది, బలగం దర్శకుడు (2)
11. పండితుడు, వాగ్ధాటి కలవాడు, ఉపన్యాసకుడు (2)
15. క్రింద నుంచి పైకి – శ్రేష్ఠము, సొంపు, కాంతి విశేషము (3)
16. గడ్డ, ముద్ద (2)
17. భాగ్యసూచక దేహలక్షణమును తెలుపు శాస్త్రము, సముద్ర సంబంధమయినది (4)
18. వినయము, అడకువ, నమ్రత (4)
19. కళింగాంధ్ర మాండలికంలో చిన్న పిల్లవాడు, మొదలు లేదు (2)
20. పురుషులతో మొదలయ్యే ఓ సామ్రాజ్యం, చివర కోల్పోయింది (2)
21. కట్టు, కట్టుటకు తగిన సాధనము, కుదువ, చెర, తొడిమ (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఫిబ్రవరి 25 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 155 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మార్చ్ 02 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 153 జవాబులు:

అడ్డం:   

1.మధుకము 4. మరుమామ 7. మన బంధువు 8. తేమ 10. మలు 11. రుణిత 13. మనుచు 14. మహిళ 15. మజరె 16. మహిమ 18. లిము 21. తరం 22. మకరతము 24. మటపల్లి/మడపల్లి 25. మణియము

నిలువు:

1.మరుతేరు 2. కమ 3. మునగ 4. మధువు 5. రువు 6. మరలుచు 9. మణిరాజము 10. మనుసంహిత 12. మహితం 15. మలినిమ 17. మరందము 19. మకల్లి 20. మతమ 22. మప 23. ముణి

సంచిక – పద ప్రతిభ 153 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version