‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అక్షమాల, ఆరంజ్యోతి (4) |
4. రాక, వచ్చుట, ధనప్రాప్తి (4) |
7. ఆభరణము (2) |
8. పేలాలు ఏకవచనము (2) |
9. వంశము, తెగ, ఇల్లు, శరీరము, పిల్లి (3) |
12. మడ్డి, జిడ్డు, లావు, కోరా, మోటు (3) |
14. తక్కువ, లోటు (2) |
15. ఇతని యొక్క (3) |
17. లభింపదగినది, యుక్తమైనది, మధ్య అక్షరం లోపించింది (2) |
18. కద, ప్రసిద్ధిని తెలుపునది (2) |
19. ధ్వని, చప్పుడు (3) |
21. అడవి, తోపు, నీళ్లు, ఇల్లు, గుంపు (2) |
23. సత్యవంతుని భార్య, మహానటి అనిపించుకున్న నటి (3) |
25. ప్రభవాది సంవత్సరాలలో 48వ సంవత్సరం, తీగ (3) |
26. వాడియైన, తీక్షణమైన (2) |
28. తగనిపని, తప్పు పని – రెండూ చివర లేనివి (2) |
29. ప్రథమా విభక్తి, వెనుక నుంచి ముందుకు వచ్చింది (4) |
30. త్రిమూర్తులు, శంకర్ దాదా ఎంబిబిస్, ఖలేజా, మున్నా – ఈ సినిమా పేర్ల లోని మొదటి అక్షరాలు వరుసగా (4) |
నిలువు:
1. అసంబంధమైన మాటలు, చెవాకులతో పాటు ఉపయోగించే పదం (4) |
2. డబ్బు, సంపద, (3) |
3. మూడు, తివ, తార్తీయము (2) |
4. మొసలికి చివర లేదు (2) |
5. ఏనుగు, మూడు అడుగుల స్థలం (3) |
6. విష్ణుమూర్తి ఖడ్గము (4) |
10. అమ్మవారు, పార్వతీదేవి (5) |
11. తండ్రికి తండ్రి, బ్రహ్మ (2) |
13. తులసి చెట్ల సముదాయం (5) |
15. పరమేశ్వరుడు, శివుడు (3) |
16. మంగళహారతి, నీరాజనం (3) |
18. కటికవారు, కఠిన హృదయులు (4) |
20. తీగ, సుబ్రమణ్యేశ్వరుని భార్య (2) |
22. ఇంద్రుని ఉద్యానవనం, పూలతోట, అలరించటం (4) |
24. మూడింటి సమూహము, త్రయము (3) |
25. గగనము, శూన్యము, సున్నా (3) |
27. రాలేడు, గుంజ, స్తంభం, సన్నని కొయ్య స్తంభం (2) |
28. ఒక మహాముని, సతీ అనసూయ భర్త (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 28 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 151 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఫిబ్రవరి 02 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 149 జవాబులు:
అడ్డం:
1.ఊరక రారు మహాత్ములు 6. రుంకం 7. లోల 8. మదనా 10. లలి 11. మకో 12. రాజకర్కటి 13. అవిసి 14. పాల 15. దాయాది ఉంటే నిప్పెందుకు
నిలువు:
1.ఊరుంటే మాలపల్లుండదా 2. రకం 3. రాయలసీమ 4. మహి 5. లుమేనాతైకోటిమింలకు 9. గిరిజ 11. మర్క 12. రాసి ఉంటే 13. అలది 14. పాదు
సంచిక – పద ప్రతిభ 149 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రామవరపు గిరిజా శంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.