Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 148

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వంటలు రుచిగా ఉంటే, నలుడు భీముడు వండినట్టుగా ____ ఇలా ఉందని అంటారు (6)
5. తెలుగులో రామాయణం వ్రాసిన కవయిత్రి పేరు, అటూ ఇటూ అయ్యింది (2)
7. కుడి నుండి ఎడమకి క్రొవ్వు (2)
8. ఏనుగు, కోతి, మేర, సాక్షి, మర్యాద (2)
9. మామమాను – 1, 3 (2)
10. తీగ (2)
12. వెనక నుంచి ముందుకు స్త్రీలు (4)
13. కుడి నుంచి ఎడమకి పువ్వు (4)
14. చంద్రుడు, కర్పూరము (1)
15. దహించునది, అగ్ని, చిత్రమూలము – తడబడింది (4)
19. పేరు లేనిది, ఉంగరము వేలు (4)
22. తిరగబడిన మలమల (4)
23. ఇచ్ఛ, తలపు (2)
24. ఇది దుఃఖానికి చేటని సామెత, అటునుంచి వచ్చింది (9)

నిలువు:

1. నలుగురిలో ఉన్నప్పుడు అనవసరంగా నవ్వడం చేటని చెప్పే సామెత (9)
2. తిరగబడిన పాపం, దోషం, కొలత (2)
3. వెలుగు, మణుల సరం, లక్ష్మీదేవి (4)
4. హస్తము, చేయి (4)
5. కింద నుంచి పైకి అబద్ధము, అనృతము (2)
6. కరవని కుక్క గురించిన సామెత (9)
9. పూదండ, వరుస, గుంపు, వంచన (2)
11. తమస్సు రూపాంతరం, మీ యొక్క (2)
16. తిరగబడిన మహ, ఆవు, గోవు (2)
17. రాములవారు – 2, 3 (2)
18. తామర కొలను, తామర తీగ (4)
19. అమ్మ, పూజ్య స్త్రీ, అమావాస్య (2)
20. స్త్రీ, ఇంతి, భార్య (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 07 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 148 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జనవరి 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 146 జవాబులు:

అడ్డం:   

1.దేవతలారా దీవించండి 6. దేవ 7. పయము 9. ముత/వుత 10. సిము 13. డురుర్మాక 14. వదేసువ 15. చేవు 16. కీసుగ 18. దేవదేవుడు 21. నందవ 22. దత్తత 23. మహర్షి 25. దరకం 26. నుతం 27. చిత్తం 28. వాడు 30. రవదే 32. దేసి 33. దేవగాంధారి 34. భావి

నిలువు:

1.దేవతరువు 2. తపసికన్పావ 3. లాయము 4. రాము 5. వింజం 6. దేవు/ముడు చేసిన మనుషులు 8. దేవీ భాగవతము 11. వందే 12. దేవకీనందనుడు 14. వపువు 17. సుదత్త 18. దేవర్షి 19. దేవదత్తం 20. డుసుకం 24. హతం 28. వాదే 29. శందే 30. రధా 31. వరి 32. దేవి

సంచిక – పద ప్రతిభ 146 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version