Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 143

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నలగుట, శ్రమము, చెదిరిపోవుట (6)
6) మనుఁబోతు, మగజింక (3)
8) తిరస్కారము, అవమానము, నాశము (5)
9) శివుడు (3)
10) గంధ ద్రవ్య విశేషము, చంద్రగుప్తుని తల్లి (2)
12) పండుగ, పర్వము, ఉత్సవం, విందు భోజనం (3)
13) వ్యాజ్యము, తగవు (3)
15) సన్నటి తుంగ పోచలతో అల్లిన రంగుల చాప (4)
17) శరీరము, జన్మము, పార్శ్వము (2)
18) బరువు, బారువ, పూచీ (2)
19) తారుమారయిన కోరిక (2)
21) చివరి రెండు అక్షరాలు కోల్పోయి, వెనుక నించి ముందుకు వచ్చిన ఇంద్రుడు; మేఘము వాహనంగా కలవాడు (5)
22) శక్తి పుత్రుడు; వ్యాసుని తండ్రి (5)
25) వేద భాగము, ఏబది పదముల సమూహము, ఒక ఫలవృక్షం (3)
26) కుడినించి ఎడమకి వచ్చిన జనకుడు; తండ్రి (5)
28) తిర్వళిక, దేవతా సమీపమున పెట్టు దీపము (3)
29) జీతబత్తెములు లేని సేవ; సులభముగ జరుగనిది (7)

నిలువు:

1) పార్వతి (5)
2) తల రాత తిరగబడింది (2)
3) క్రయవిక్రయములవలన వచ్చిన విశేషధనము, ప్రాప్తి (3)
4) తువరము, ఒగరు (4)
5) మొదటి అక్షరం లేని ప్రకాశము, ఎండ (2)
6) ముని భార్య (4)
7) వరుసపెట్టు (5)
11) పల్లవము, ముగ్గుతో పెట్టు అలంకారము (3)
14) గాలితో వాన, ఝంఝ (4)
15) ఏడుగురు చిరంజీవులను ఇలా అంటారు (7)
16) కావలివాడు (5)
18) భానుమూర్తి లో 1,3 (2)
20) ఐశ్వర్యము, దుర్గాదేవి, ధనవంతురాలు (2)
23) తిరగబడిన శ్రీకృష్ణుడి తండ్రి (5)
24) తిమ్మిరి యొక్క రూపాంతరము, కింద నుంచి పైకి (3)
25) పస, సారము (3)
27) ధర్మము, నియమము, మర్యాద, స్వభావము (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 03 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 143 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 08 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 141 జవాబులు:

అడ్డం:   

1) శతారము 4) శుభ్రాంశుడు/శుభ్రాంశువు 8) హుకుం 9) మరకతము 11) భద్ర 12) వ్రే 13) మురము 15) న్యక 17) పాదరసం 18) కృష్ణతులాభారము 19) దరిమిల 20) ములుదోస 22) పిలక 24) ణవీ 25) పసికందులు 26) నన 29) తలోదరి 30) నులివాడు

నిలువు:

2) తాత 3) ముదిరము 4) శుద్ధాంతము 5) శుకం 6) బహుధాన్య 7) చంద్రహాసం 10) కరతలామలకం 16) కృష్ణల 17) పారము 18) కృమిఘ్న 19) దక్షిణము 21) సన్మానము 22) పిసినారి 23) కదుకొను 27) లోలో 28) కోవా

సంచిక – పద ప్రతిభ 141 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version