Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక హాస్య కథల పోటీ 2018

సంచిక హాస్య కథల పోటీ 2018″కి సంబంధించిన వివరాలు, నిబంధనలు, గడువు తేదీ తదితర సమాచరంతో కూడిన ప్రకటన ఇది.

సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా సంచిక ‘హాస్య కథల పోటీ‘ నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే.

ఈ పోటీలో మూడు బహుమతులు – ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. అయితే ఈ బహుమతులు ‘సంచిక’ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కథలతో పాటు, పాఠకులు ఎంపిక చేసిన కథలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పోటీకి ఆరుగురు రచయితలు బహుమతులు పొందే వీలుందన్న మాట. క్రిటిక్స్ అందించే ఈ మూడు బహుమతులు, పాఠకులు ఎంపిక చేసిన మూడు బహుమతులు!

ఇవేకాక ఈ పోటీలో అయిదు ప్రోత్సాహక బహుమతులుంటాయి… అయితే, ఈ ప్రోత్సాహక బహుమతులకు వోటింగ్ వుండదు. వీటిని సంచిక సంపాదక వర్గం నిర్ణయిస్తుంది.

ప్రథమ బహుమతి:     రూ.5000/-

ద్వితీయ బహుమతి:   రూ.3000/-

తృతీయ బహుమతి:    రూ 2000/-

ప్రోత్సహక బహుమతి:  రూ.1000/

హాస్య కథల పోటీకి కథలు 31 జూలై 2018 తేదీ కల్లా పంపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు నెల నుంచి సెప్టెంబరు నెల వరకూ ఈ కథల పోటీకి అందిన కథలను పాఠకుల ఎంపిక కోసం ప్రచురించడం జరుగుతుంది. ఇలా ప్రచురితమైన కథలలోంచి పాఠకులు తమకు నచ్చిన కథలు మూడింటిని ‘ఓటింగ్’ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అధిక శాతం ఓట్లు సాధించిన మొదటి మూడు కథలు పాఠకుల బహుమతిని పొందుతాయి.

ఇలా రెండు అవార్డులు ఇవ్వడం ఎందుకంటే క్రిటిక్స్ దృష్టికీ, పాఠకుల దృష్టికీ నడుమ ఉన్న అంతరాన్ని విశ్లేషించడం. పారదర్శకమైన రీతిలో బహుమతి రచనలను ఎంపిక చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ‘బహుమతి రచనల’ విషయంలో ఉన్న దురూహలు, అపోహలకు ఆస్కారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించాలన్నది మరో ఉద్దేశం.

రచనలను ఈమెయిల్ ద్వారా పంపదలచుకున్నవారు kmkp2025@gmail.com కు పంపించవచ్చు. సబ్జెక్ట్ లైన్‌లో హాస్యకథల పోటీకి అని స్పష్టంగా రాయాలి.  రాతప్రతిని పంపాలనుకున్నవారు ఈ క్రింది అడ్రసుకు పోస్టులో గానీ కొరియర్‌లో గాని నిర్ణీత గడువులోగా అందేట్లు పంపించవచ్చు. కవరుపై హాస్యకథల పోటీకి అని స్పష్టంగా రాయాలి. ఒక రచయిత ఒకే రచన పంపాలన్న నియమం లేదు. వాట్స్‌అప్ ద్వారా రచనలు పంపాలనుకున్నవారు 9849617392 నంబరుకు తమ రచనలను వాట్స్ ఆప్ చేయవచ్చు. అయితే, పోటీకి రచనలు పంపేవారు విధిగా పోటీ రచన అన్నది స్పష్టంగా రాయాల్సివుంటుంది. లేకపోతే ఆ రచనను సాధారణ సంచికకు పంపిన రచనగా భావించే అవకాశం వుంది.

Kasturi Muralikrishna
Plot no.32, H.No 8-48
Raghuram nagar colony, Aditya hospital lane
Dammaiguda, Hyderabad-83
Ph: +919849617392

కాబట్టి హాస్య కథకులు వెంటనే కలాలు పదును పెట్టుకుని 31 జూలై 2018 తేదీ లోగా కథలు పంపగలరు.

Exit mobile version