Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీ ఫలితాల ప్రకటన

చయితలకు, పాఠకులకు, సంచిక శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు!

సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీకి 300 పైగా కథలు పంపి పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు. పోటీలో వర్ధమాన కథకులు, సీనియర్ రచయితలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాకు అందిన మూడువందలకు పైగా కథల నుంచి 140 కథలను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ప్రచురణకు ఎంపిక చేశాము.

ఆ ఎంపికయిన కథల నుండి కొన్ని ప్రామాణికాలు నిర్ణయించుకుని, 60 కథలను బహుమతి ఇవ్వదగ్గ కథలుగా ఎంపిక చేశాము. ఆ తరువాత ఈ కథలను ముగ్గురు పాఠకులకు ఇచ్చి 40 కథలను ఎంపిక చేయమన్నాము.

వారిచ్చిన కథలను న్యాయ నిర్ణేతలు ముగ్గురికి ఇచ్చి విడివిడిగా 20 కథల జాబితా ఇవ్వమన్నాము.

వారిచ్చిన 20 కథల జాబితాలో కామన్‌గా ఉన్న కథలతో ఒక జాబితా తయారు చేశాము. ఆశ్చర్యంగా మూడు జాబితాల్లో కామన్‌గా ఉన్న కథల సంఖ్య 16.

ప్రైజ్ మనీ ₹ 40,000/- లను ఈ 16 కథకులకు ఒక్కొక్కరికీ ₹ 2500/- బహుమతిగా నిర్ణయించటం సులభమయింది.

₹ 2500/- బహుమతి పొందిన కథలు, కథకులు:

  1. మొక్కై వొంగనిది – కె. లక్ష్మీ శైలజ (కరణం శైలజ)
  2. వాన ముద్దు-వరద వద్దు – మంగు కృష్ణకుమారి
  3. అంత్రాల రొట్టె – బి.కళాగోపాల్
  4. అంతఃచక్షువు – డా. సన్నిహిత్‌
  5. ప్రతుష్టి – సంధ్యా యల్లాప్రగడ
  6. అతడు రాతి మనిషి – బలభద్రపాత్రుని ఉదయ శంకర్
  7. కార్తీక దీపాలు – ఆసూరి హనుమత్ సూరి
  8. వెడ్ షూట్స్ – పి వి రామ శర్మ
  9. నిచ్చెన! – బులుసు సరోజినిదేవి
  10. డైరీ – సింగీతం ఘటికాచల రావు
  11. బిచ్చగాడు – శిరిప్రసాద్
  12. భిన్న కోణాలు – తిరుమలశ్రీ/పి.వి.వి. సత్యనారాయణ
  13. బంధం-ఆసరా-అనుబంధం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
  14. బహుశా – జె.ఎస్.వి. ప్రసాద్
  15. ఊరు రమ్మంటోంది! – కె.వి.లక్ష్మణ రావు
  16. రేపటిని ప్రేమించు – కోపూరి పుష్పాదేవి

~

సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ పోటీల్లో ఎక్కడా సంపాదకుల విచక్షణ వోటు అవసరం రాలేదు. పాల్గొన్న రచయితలకు, న్యాయనిర్ణేతలకూ శతకోటి వందనాలు.

సంచికతో బాటుగా, బహుమతులను స్పాన్సర్  చేసిన డా. అమృతలత గారికి, శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారికీ, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తొలి వడపోత తరువాత ఫేస్‍బుక్‌లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు ముందుకొచ్చి, కొంత మొత్తాన్ని తామూ స్పాన్సర్ చేస్తామన్నారు. అయితే అప్పటికే పుట్టి నాగలక్ష్మి గారు పోటీ కోసం తమ కథ పంపి ఉండడంతో, వారి అనుమతితో వారి కథను బహుమతికి పరిశీలించలేదు, సాధారణ ప్రచురణకు మాత్రమే పరిగణించాము.

~

సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా:

~

బహుమతి పొందిన కథలు రచించిన కథకులకు బహుమతి ధనం దీపావళి రోజు సూర్యోదయానికల్లా పంపేశాము.

ఒకవేళ ఏ రచయితకయినా తన కథ సాధారణ ప్రచురణ అవటం ఇష్టంలేక, ఆ కథను వేరే పోటీకి పంపించుకునేట్టయితే 2-3 రోజుల్లో తెలియజేయగలరు.

ముందుగా బహుమతి కథలను, ఆ తరువాత సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు సంచికలో ప్రచురిస్తాము.

అనివార్య కారణాల వల్ల ‘సైనిక కథల సంకలనం’ పని ఆలస్యమవుతోంది. ఈ సంకలనంలోకి ఎంపికయిన కథల జాబితా త్వరలో ప్రకటిస్తాము.

ఈ కథల పోటీ విజయవంతమవటంలో తోడ్పడిన రచయితలకు, న్యాయనిర్ణేతలకు, సంచిక సిబ్బందికి, ముఖ్యంగా పాఠకులకు సంచిక కృతజ్ఞతలను, మనఃపూర్వక ధన్యవాదాలను సవినయంగా తెలుపుకుంటోంది.

ధన్యవాదాలు.

Exit mobile version