[బాలబాలికల కోసం సముద్రజీవుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ప్రశ్నలు:
1.
పేరు గుర్రమే కానీ పరుగెత్తలేదు
ఉండేది సముద్రమే కానీ చేపకాదు
2.
మెదడు లేదు కళ్ళు లేవు
కానీ ఐదు చేతులుంటాయి
నీటిలో మెరిసే నక్షత్రం
3.
నీళ్ళలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది
ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది
రంపం లాంటి పళ్ళు నోట్లో ఉంటాయి
4.
నీలంగా ఉంటాను నీళ్ళల్లో ఉంటాను
జంతువుల్లో కెల్లా పెద్ద జంతువును
నేనెవరో చెప్పండి?
5.
ఎనిమిది కాళ్ళుంటాయి
కానీ సాలీడు కాదు
నీళ్ళలో నివాసముంటుంది
కానీ చేప కాదు
6.
స్వాతి చినుకులై
నోరు తెరిచి ఎదురు చూసే సముద్ర జీవి
ముత్యమంటి బిడ్డను కని
కడుపులోనే దాచుకునే జీవి
~
జవాబులు:
1. సీహార్స్ 2. స్టార్ ఫిష్ 3. మొసలి 4. నీలి తిమింగలం 5. అక్టోపస్ 6. ఆల్చిప్ప
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.