Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సముద్రజీవుల పొడుపు కథలు

[బాలబాలికల కోసం సముద్రజీవుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ప్రశ్నలు:

1.
పేరు గుర్రమే కానీ పరుగెత్తలేదు
ఉండేది సముద్రమే కానీ చేపకాదు

2.
మెదడు లేదు కళ్ళు లేవు
కానీ ఐదు చేతులుంటాయి
నీటిలో మెరిసే నక్షత్రం

3.
నీళ్ళలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది
ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది
రంపం లాంటి పళ్ళు నోట్లో ఉంటాయి

4.
నీలంగా ఉంటాను నీళ్ళల్లో ఉంటాను
జంతువుల్లో కెల్లా పెద్ద జంతువును
నేనెవరో చెప్పండి?

5.
ఎనిమిది కాళ్ళుంటాయి
కానీ సాలీడు కాదు
నీళ్ళలో నివాసముంటుంది
కానీ చేప కాదు

6.
స్వాతి చినుకులై
నోరు తెరిచి ఎదురు చూసే సముద్ర జీవి
ముత్యమంటి బిడ్డను కని
కడుపులోనే దాచుకునే జీవి

~

జవాబులు:

1.  సీహార్స్ 2. స్టార్ ఫిష్ 3. మొసలి 4. నీలి తిమింగలం 5. అక్టోపస్ 6. ఆల్చిప్ప

Exit mobile version