Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమరత్వం..!

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘సమరత్వం..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నుభవాలను మరొకరితో
స్వేచ్ఛగా పంచుకుంటేనే కదా
మానవీయత విలువ తెలిసేది
ఎదలోని బాధలను దాచుకోకుండా
ఉన్నదున్నట్లుగా మాట్లాడుకుంటూనే
జీవితం గురించి విలువ తెలిసేది..!

కల్మషం లేని బోళాతనమనుకునేవు
నటులు మహానటులుగా ఎదుగుతున్నారు
నీడలా వెంటాడుతున్న నయవంచకులను
గుర్తించే జ్ఞానోదయమే కావాలిప్పడు
నమ్మకంగా విశ్వాసంగా ఉండడాలు
అపహాస్యానికి గురవుతున్న తరుణమిది..!

దేన్నైనా సరే సాధించాలనే సమరత్వం
నీలో రగులుతున్నంత కాలం
రంగులు మార్చే ఊసరవెల్లులను
దరికి రానీయకుండా కట్టడి చేయగలవు
ప్రియమైన వారి ఎడబాటును సైతం
కుంగుబాటుకు గురికాక తట్టుకోగలవు..!

Exit mobile version